
దేవరకొండ, వెలుగు: నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించడానికే మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. జనహిత ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ విత్ పీపుల్కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండాలో పర్యటించారు. స్థానిక సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడారు. వరద ఇబ్బందులు తొలగించేందుకు మర్రిచెట్టు తండా నుంచి బుడ్డ తండా వరకు బ్రిడ్జి నిర్మించేందుకు రూ.1.70 కోట్లు మంజూరు చేయించానన్నారు. నిర్మాణంలోని ఇందిరమ్మ ఇండ్ల పరిశీలించారు.
అనంతరం అక్కంపల్లి ప్రాజెక్టు కాలువలో పడి మృతిచెందిన పీఏపల్లి మండలం వద్దిపట్ల పరిధిలోని పడమటి తండాకు చెందిన 9 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన చెక్కులను దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో అందజేశారు. కొండమల్లేపల్లి మాజీ ఎంపీపీ రేఖ శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభకాంక్షలుతెలిపారు. ఆర్డీవో రమణా రెడ్డి, మాజీ ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి, తెర సత్యం రెడ్డి, కాంగ్రెస్మండలాల అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, వేమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.