ఉగ్రవాదుల నుంచి ముప్పున్న నేతకు ఎలాంటి కారిచ్చారంటే..

ఉగ్రవాదుల నుంచి ముప్పున్న నేతకు ఎలాంటి కారిచ్చారంటే..
  • పోలీసోళ్లు నా ప్రాణాలను కాపాడతారో లేదో తెలియడం లేదు
  • ట్రబులిస్తోందని ఎన్నిసార్లు చెప్పినా నో యూజ్
  • రిపేర్లు చేసి మళ్లీ అదే బండి తిరిగిస్తున్నారు
  • నాకిచ్చిన లాంటి బండ్లు వేరే ఎవరికీ ఇవ్వొద్దు
  • నన్ను నేను ఎలా కాపాడుకోవాలో.. నేనే చూసుకుంటా
  • మొరాయించి రోడ్డుపై నిలిచిపోయిన కారు వద్దే మాట్లాడిన వీడియోను షేర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: ఉగ్రవాదుల నుంచి ప్రాణాపాయ ముప్పున్న తనకు బుల్లెట్ ప్రూఫ్ కారని చెబుతూ.. పాత స్క్రాప్ నుంచి తీసిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారునే ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికలతో  ప్రభుత్వం తనకు సమకూర్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు తరచూ మొరాయిస్తోందని..  ఎంతగా అంటే ఎప్పుడు.. ఎక్కడ ఆగిపోతోందో తెలియడం లేదన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్ నుంచి షాద్ నగర్ కు వెళ్లి వస్తుండగా రోడ్డుపై మొరాయించిందట. 
దీంతో కారు వద్దే నిలబడి మాట్లాడిన వీడియోను రాజాసింగ్ షేర్ చేశారు. 
తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనలేదు..చంద్రబాబు టైంలో కొన్నవే ఇప్పటికీ వాడుతున్నారు
2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఏవీ కొన్నట్లు లేదని.. పాత స్క్రాప్ లోంచి తీసిచ్చిన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ కారునే తనకు అంటగట్టారని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. చంద్రబాబు హయాంలో కొన్న పాత బుల్లెట్ ప్రూప్ కార్లే ఇప్పటికీ వాడుతున్నారని.. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత కొన్నట్లు లేదని పేర్కొన్నారు.  ప్రభుత్వం తనకు సమకూర్చిన బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్ ఇప్పటికి చాలా సార్లు ట్రబుల్ ఇచ్చిందన్నారు. 
ఎన్నోసార్లు లెటర్లు రాశా.. మేసేజీలు పెడుతున్నా.. 
తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తరచూ ట్రబుల్ ఇస్తోందని తాను ఇంటలిజెన్స్ ఐజీ,  డీజీపీ దృష్టికి తీసుకెళ్లినప్పటికి స్పందించడంలేదన్నారు. తనకు ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు రాజాసంగ్. నాకు ఇలాంటి వాహనం ఎందుకిచ్చారో అర్థం కావడం లేదన్నారు. మేసేజీలు పెడితే వచ్చి తీసుకెళ్లి రిపేర్లు చేసి మళ్లీ అదే వెహికల్ ఇస్తున్నారని.. తనకు చేస్తే చేశారు కానీ.. వేరె ఎవరికీ ఇలాంటి వాహనాలు ఇవ్వొద్దని ఆయన సూచించారు. 

 

 

 

ఇవి కూడా చదవండి

ఉచిత పథకాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

థాయిలాండ్ ఓపెన్ లో భారత్ కు మిశ్రమ ఫలితాలు..

కాంస్య పతకం సాధించిన బాక్సర్ మనీషా మౌన్