పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలి : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
  • కలెక్టర్ ను ఫోన్​లో కోరిన  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 

మునుగోడు, వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు మునుగోడు నియోజకవర్గంలోనే అత్యధికంగా పత్తి డ్యామేజ్ అయిందని, ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టర్​ఇలా త్రిపాఠికి ఫోన్​చేసి, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలను పెంచి, పత్తి కొనుగోళ్లు వేగవంతం కోరారు. తేమశాతం సాకుతో సీసీఐ అధికారులు రైతులను  ఇబ్బందులకు గురిచేస్తున్న విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. 

సీసీఐ రిజెక్ట్ చేసిన పత్తిని దళారులు రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, అదే పత్తిని సీసీఐకి అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దళారులను నియంత్రించడంతోపాటు సీసీఐ అధికారులు నేరుగా రైతుల వద్ద నుంచి పత్తిని కొనుగోలు చేసేలా చూడాలన్నారు. లైసెన్స్​లేకుండా ఎంత మంది దళారులు రైతుల వద్ద పత్తి కొనుగోలు చేస్తున్నారో వారి జాబితా సిద్ధం చేయాలని పోలీసులను ఆదేశించారు.