
- బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
నవీపేట్: వరదల కారణంగా నష్టపోయిన రైతులకు కాంగ్రెస్సర్కార్ అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని కోస్లీ, యంచ గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తో కలిసి పరిశీలించారు. రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పంట నష్టం వివరాలు సేకరించి పరిహారం అందిస్తామన్నారు. సమగ్ర నివేదిక తయారు చేసి ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తానని అధికారులకు సూచించారు.
కరెంట్ పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, రోడ్ల మరమ్మతులు చేయాలని సూచించారు. తహసీల్దార్ వెంకటరమణ, ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ వైస్‌ఎంపీపీ హరీశ్‌కు చెందిన కోళ్ల ఫారం వరదలో కొట్టుకుపోగా ఆయనకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.