తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూల పండుగ బతుకమ్మ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూల పండుగ బతుకమ్మ : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

 పాలమూరు, వెలుగు : తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపే పూల పండుగ బతుకమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ సంబరాలకు ఎమ్మెల్యేలు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పర్ణికా రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యెన్నం మాట్లాడుతూ కుటుంబంతో ఆనందంగా జరుపుకునే పండగ బతుకమ్మ అని అన్నారు. ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగిన ఎమ్మెస్సీ ఎంట్రన్స్ లో టాప్ రెండు ర్యాంకులు సాధించారని ప్రిన్సిపాల్ చెప్పడం సంతోషంగా ఉందన్నారు. 

ఈ ర్యాంకుల వల్ల కళాశాలతోపాటు మహబూబ్ నగర్ ప్రతిష్టను మరింత పెంచిందని చెప్పారు. కళాశాలలో విద్యార్థులకు ఐదు అదనపు తరగతులు అవసరం ఉన్నాయని, వాటిని త్వరలో నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. అనంతరం ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో వారం రోజులపాటు జరిగిన ఓరియంటేషన్  శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు 
అందజేశారు.