Monsoon Food: ఈ వర్షాల్లో.. ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకుంటే హెల్దీ

 Monsoon Food: ఈ వర్షాల్లో.. ఈ ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకుంటే హెల్దీ

వర్షాకాలం వచ్చేసింది. వేసవి నుంచి ఉపశమనం దొరికింది అనుకునే లోపే.. ఈ సీజన్ లో అనేక ఆరోగ్య సమస్యలు కూడా తోడుగా వచ్చేస్తాయి. డెంగ్యూ, మలేరియా, సీజనల్ ఫ్లూ, టైఫాయిడ్ వంటి దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లకు ఈ వర్షాకాలంలో కొదవే లేదు. అనేక కలరా, మలేరియా వంటి అనేక అంటువ్యాధులు మరింత పెద్ద సమస్యగా మారుతాయి. ఈ కాలంలో మంచి ఆహారపు అలవాట్లే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలుగుతాయి. అందుకు సరైన భోజనంతో పాటు పండ్లు తీసుకోవడం కూడా చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు ఈ సీజన్ లో సంక్రమించే వ్యాధులతో పోరాటం చేసేందుకు సహాయపడతాయి. ఈ వానాకాలంలో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి సహాయపడే కాలానుగుణ పండ్ల జాబితా ఏంటో ఇప్పుడు చూద్దాం.

వర్షాకాలంలో ఈ 5 పండ్లు తప్పనిసరి

పీచెస్:

ఈ పండ్లలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీన్ని పచ్చిగా లేదా సలాడ్‌తో కలపి తినవచ్చు. అదీ కాదంటే గుజ్జుగా తీసైనా తినొచ్చు. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఫోలేట్, ఐరన్ లు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయోజనకారిణిలా తోడ్పడుతాయి.

లిట్చీ:

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముఖ్యంగా అస్తమా రోగుల శ్వాసక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, బరువు తగ్గడాన్ని వేగవంతం చేస్తాయి. లిట్చీ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, అంతే కాకుండా శరీరంలో వ్యాధి నిరోధకతకు సహాయపడుతుంది. వర్షాకాలంలో సంక్రమించే సాధారణ జలుబును నివారించేందుకు.. లిట్చీలోని విటమిన్ సి సహాయపడుతుంది.

ఆల్బుకారా:

ఆల్బుకారా పండ్లు చవకైన పండ్లు. ఈ పండ్లలోని ఎరుపు-నీలం ఆంథోసైనిన్ వర్ణద్రవ్యం క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పని చేస్తుంది. అందువల్ల శరీరం వర్షాకాలంలో ఇన్ఫెక్షన్, నీటి ద్వారా వచ్చే అనారోగ్యాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ALSO READ :టమాటాలు ఫ్రీగా ఇస్తున్న ఆటో డ్రైవర్.. కండీషన్స్ అప్లయ్ అంట..

చెర్రీస్

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలకు ఫ్రీ రాడికల్స్ తీసుకువచ్చే హానిని ఆపుతాయి లేదా రివర్స్ చేస్తాయి. అంతే కాకుండా క్యాన్సర్ నివారణ సాధనాలుగా కూడా పని చేస్తాయి. వీటితో పాటు ఇవి ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

అల్ల నేరేడు:

వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి... విటమిన్లు, ఐరన్, ఫోలేట్, పొటాషియం, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ పండు తినడం చాలా మంచిది. అదనంగా, వర్షాకాలంలో సాధారణంగా వచ్చే అనారోగ్యాలు, జీర్ణ సమస్యల చికిత్సలో ఇది సహాయపడుతుంది.

వర్షాకాలం సరదాగా గడపడానికి మంచి సమయం అయినప్పటికీ, జలుబు, దగ్గు, జీర్ణశయాంతర సమస్యల వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఎవరికి వారే తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అంతకంటే ముందు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కృషి చేయాలి.