
- కఠినంగా శిక్షించిన తల్లి
హుబ్బళ్లి(కర్నాటక): బాగా అల్లరి చేస్తున్నాడని కొడుకుపై తల్లి కఠినంగా ప్రవర్తించింది. ఆ చిన్నారి చేతులు, కాళ్లపై వేడి ఇనుప రాడ్‌తో వాతలు పెట్టింది. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆమె కోపం చల్లారలేదు. దీంతో వారు సమాచారం ఇవ్వగా, పోలీసులు వచ్చి ఆ మహిళను అరెస్ట్ చేశారు. కర్నాటకలోని హుబ్బళ్లి టౌన్ టిప్పు నగర్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. తన కొడుకు విపరీతంగా అల్లరి చేస్తుండటంతో తల్లి అనూష హుళిమారా తీవ్రంగా కోప్పడింది.
అంతటితో ఆగకుండా ఇనుప రాడ్‌ను వేడి చేసి అతడి కాళ్లు, మెడ, చేతులపై వాతలు పెట్టింది. పిల్లాడి అరుపులు విని చుట్టుపక్కలవాళ్లు చలించిపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు స్పాట్‌కు చేరుకుని అనూషను అదుపులోకి తీస్కున్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులు జోక్యం చేస్కుని బాలుడికి అండగా నిలవాలని స్థానికులు కోరారు.