
ఇంటిని, పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవడంలో తల్లులు ముందుంటారు. ఇంట్లో అందరూ హెల్దీగా ఉండేలా కేర్ తీసుకునే మదర్స్ తమ ఆరోగ్యాన్ని అంతగా పట్టించుకోరు. కానీ, రోజంతా ఏదో ఒక పనితో అలిసిపోయే అమ్మలు ఫిజికల్‌గా, మెంటల్‌గా సెల్ఫ్‌కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. అవేమిటంటే... మదర్స్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండడమే కాకుండా, మానసిక ఆరోగ్యం పైనా దృష్టిపెట్టాలి. కాన్పు తర్వాత తల్లులు తమ ఆరోగ్యం, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి. అందుకోసం రోజూ కొంత టైం యోగా, ధ్యానంతో పాటు తేలికైన ఎక్సర్సైజ్లు చేయాలి. నాన్‌స్టాప్ పనులకి మధ్య మధ్యలో బ్రేక్ ఇవ్వాలి. కంటినిండా నిద్రపోవాలి. ఫ్రెండ్స్‌ను కలవడం, నచ్చిన పుస్తకాలు చదవడం వంటివి మనసును తేలిక చేస్తాయి. తల్లిగా బాధ్యతలు చూసుకుంటూనే, ఇష్టమైన పనులు చేయాలి. కాసేపు సింగింగ్, డాన్స్ చేస్తూ రిఫ్రెష్ అవ్వాలి. రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే కడుపునిండా తినాలి..అది కూడా హెల్దీగా. ఫ్రూట్స్‌ని రెగ్యులర్ డైట్లో భాగం చేయాలి. చాలామంది తల్లులు, పిల్లల ధ్యాసలో పడి చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. ప్రస్తుతానికి అవి పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా ఫ్యూచర్లో లేనిపోని తిప్పలు తెచ్చిపెడతాయి. అందుకే సమస్య కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.