రేవంత్‌‌‌‌‌‌ వల్లే బనకచర్లకు బ్రేక్‌‌‌‌ పడింది : ఎంపీ చామల

రేవంత్‌‌‌‌‌‌ వల్లే బనకచర్లకు బ్రేక్‌‌‌‌ పడింది : ఎంపీ చామల
  • ప్రజలను హరీశ్ రావు తప్పుదోవ పట్టిస్తున్నడు: ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు:  సీఎం రేవంత్ రెడ్డి కృషి వల్లే కేంద్రం ఏపీలోని బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ లో మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వెంటబెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై చేసిన ఒత్తిడి మేరకే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఆపివేశారని వివరించారు. 

అయితే, ఈ ఘనత తమదేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఆయన తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో  బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. అందుకే సెంటిమెంట్ పేరుతో మరోసారి పార్టీని కాపాడుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎంత ప్రయత్నం చేసినా ప్రజా పాలనలో తెలంగాణ ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మరని చామల స్పష్టం చేశారు.