కాలేజ్ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుండి రూ. 33 లక్షలు కొట్టేసారు..

 కాలేజ్ అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుండి రూ. 33 లక్షలు కొట్టేసారు..

చెన్నైలోని మెడికల్ కాలేజీలో  అడ్మిషన్ ఇప్పిస్తామని చెప్పి, ఇద్దరు వ్యక్తులు లెస్లీ పింటో (56) అనే రిటైర్డ్ ఉద్యోగి నుండి  రూ. 33.53 లక్షలు వసూల్  చేసి ముంచేశారు. సమాచారం ప్రకారం లెస్లీ  పింటో అంధేరీలో ఉంటుండగా.. అతనిని రాకీ సావియో & స్టీఫెన్ పీటర్గా నమ్మించి మోసం చేసినట్లు గుర్తించిన పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు.

అసలు ఏం జరిగిందంటే :డిసెంబర్ 5న ఇచ్చిన  ఫిర్యాదు ప్రకారం, లెస్లీ పింటో తన కూతురు అజల్ (19)కి 2022 జూలైలో నీట్ (NEET)లో తక్కువ మార్కులు రావడంతో అడ్మిషన్ రాలేదు. దింతో అతని బంధువు లెస్లీ  పింటోని సావియోకు పరిచయం చేశారు. సావియో తన బిజినెస్ పార్ట్నర్ అయినా స్టీఫెన్  చెన్నైలో అడ్మిషన్ ఇప్పించగలడని చెప్పాడు.

2022 సెప్టెంబర్ 19న లెస్లీ పింటో స్టీఫెన్‌ను సంప్రదించగా... స్టీఫెన్ సర్వీస్ టాక్స్, హాస్టల్ ఫీజులు, ప్రాసెసింగ్ ఛార్జీలతో కలిపి మొత్తం రూ. 30 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. 

లెస్లీ పింటో తన బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్  నుండి RTGS ద్వారా 30 లక్షలు జోహన్ పీటర్ అనే వ్యక్తికి చెందిన  బ్యాంక్ అకౌంట్ కు పంపించాడు. 

►ALSO READ | శాలరీ రూ.8 వేలు.. జీఎస్టీ బకాయిలు రూ.13 కోట్లు.. ఏదో మతలబే ఉందని అకౌంట్ బ్లాక్ చేసిన అధికారులు !

2022 డిసెంబర్ 18న నిందితుడు లెస్లీ పింటో, అతని భార్య, కూతురిని మద్రాస్ మెడికల్ కాలేజీకి రమ్మని పిలిచారు. అక్కడ వారిని చాలా సేపు  వేచి ఉండేలా చేశారు. తరువాత స్టీఫెన్ వచ్చి, 2023 జనవరిలో అడ్మిషన్ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుందని చెప్పాడు.

తరువాత ప్రాసెస్ ఆలస్యం అవుతోందని చెప్పి ఏవేవో కారణాలు చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత 2023 జూన్లో కన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాడు.

అయితే, అడ్మిషన్ జరగలేదు. ఆ తర్వాత నిందితులు ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేసి, కనిపించకుండా పోయారు. పదేపదే ఫోన్ చేసినా వారి నుండి ఎలాంటి  సమాధానం రాకపోవడంతో, చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

పోలీసులు సావియో, పీటర్‌లపై భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) సెక్షన్లు 3(5), 316(2), 318(4) కింద మోసం,   కేసు నమోదు చేశారు.