ముంబై బాంబు బెదిరింపు కేసులో కీలక అప్డేట్..వాట్సాప్ మేసేజ్ పంపింది ఇతనే

ముంబై బాంబు బెదిరింపు కేసులో కీలక అప్డేట్..వాట్సాప్ మేసేజ్ పంపింది ఇతనే

నోయిడా: ముంబై బాంబు పేలుడు బెదిరింపుల కేసులో కీలక అప్డేట్.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బీహార్‌కు చెందిన 50 ఏళ్ల అశ్విన్ కుమార్ సుప్రాగా గుర్తించారు. నోయిడాకు చెందిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఉపయోగించి సుప్రా బాంబు బెదిరింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది. 

దర్యాప్తులో బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్ ,సిమ్‌ను కూడా క్రైమ్ బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. లష్కరే జిహాదీకి చెందిన 14 మంది ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడ్డారని..400 కిలోల ఆర్‌డిఎక్స్ ఉపయోగించి పెద్ద దాడికి ప్లాన్ చేశారని నిందితుడు ఆ బెదిరింపు మేసేజ్ చేసినట్లు గుర్తించారు. నిందితుడు అశ్విన్ వాట్సాప్ ద్వారా ముంబై పోలీసులకు నేరుగా బెదిరింపు పంపించాడని తెలిపారు.  

మేసేజ్ గుర్తించిన వెంటనే రంగంలోకి దిగిన ముంబై జాయింట్ సీపీ గౌతమ్, బుద్దనగర్ పోలీస్ కమిషనర్ లక్ష్మీ సింగ్ కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును జాయింట్ సీపీ, స్వాట్ బృందంలో ఆధ్వర్యంలో నాలుగు గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. నోయిడా లోని సెక్టార్ 79లోని ఓ ఇంట్లో నిందితుడు అశ్విన్ ను అదుపులోకి తీసుకున్నారు.  

నిందితుడు అశ్విన్ ను నోయిడా నుంచి ముంబైకి తరలించారు. బెదిరింపు వెనక ఎవరైనా ఉన్నారా.. ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డారు అనే కోణంగా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. నిందితుడు గత ఐదేళ్లుగా జ్యోతిష్యుడిగా ,వాస్తు సలహాదారుగా పనిచేస్తున్నాడని సమాచారం.