గణనాథుడికి ముస్లిం వ్యక్తి 10 కేజీల లడ్డూ

గణనాథుడికి ముస్లిం వ్యక్తి 10 కేజీల లడ్డూ

మరిపెడ, వెలుగు: గణేశ్​ నవరాత్రుల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలోని ఆర్ఎస్ ప్లాజా ఉత్సవ కమిటీ విగ్రహం ఏర్పాటు చేసింది. విగ్రహ దాత రేసు సునీత, సత్తిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడికి సోమవారం10 కేజీల లడ్డూను ముస్లిం సోదరుడు సల్మాన్ సమర్పించారు. అనంతరం అర్చకుడు రఘురాంశర్మ ప్రత్యేక పూజలు చేశారు.