నా సామిరంగా.. నాగ్ పిల్ల దొరికేసింది..ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే

నా సామిరంగా.. నాగ్ పిల్ల దొరికేసింది..ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే

కన్నడలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఆషిక రంగ‌నాథ్ (Ashika Ranganath) తెలుగు తెరపై మరోసారి మెరవనుంది. అమిగోస్లో కళ్యాణ్​ రామ్​తో ఈ బ్యూటీ నటించింది. ప్రస్తుతం నా సామిరంగ సినిమాలో నాగ్ సరసన క్రేజీ ఆఫర్​ దక్కించుకుంది. కింగ్​ నాగార్జున (Nagarjuna) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగా’ (Naa Saami Ranga). ఈ సినిమాలో హీరోయిన్​గా ఆషిక సెలక్ట్​ అయినట్టు మేకర్స్ పోస్టర్ తో పాటు వీడియో రిలీజ్ చేశారు. 

ఈ క్రేజీ సినిమాలో ఆమె వరలక్ష్మి పాత్రను పోషిస్తోంది. రిలీజ్ చేసిన ఫస్ట్లుక్ నాగ్ అభిమానులని తెగ అట్ట్రాక్ట్ చేస్తోంది. అద్దం ముందు కూర్చొని..వయ్యారాల నడుముతో..అషికా సింగారించుకుంటుంటే, బయట కాంపౌండ్ వాల్ దగ్గర బీడీ తాగుతూ..మత్తెక్కిన కళ్ళతో నాగార్జున చూస్తున్న వరలక్ష్మి గ్లింప్స్ ఫ్యాన్స్ను కైపెక్కిస్తోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి వీడియోలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. నాగ్ ఫ్యాన్స్కు కావాల్సిన అచ్చమైన రొమాంటిక్ మన్మధుడు దిగిపోయాడనే ఫీలింగ్ కలిగిస్తోంది ఈ వీడియో. 

అలాగే..ఈ సందర్భంగా మరో అప్ డేట్ కూడా ఇచ్చారు మేకర్స్. త్వరలో ఈ సినిమా పాటల నగారా మోగనుందని తెలిపారు. 'ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తోందే' అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ కోసం పలువురు హీరోయిన్స్ ని పరిశీలించిన మేకర్స్, ఫైనల్ గా ఈ కన్నడ భామను ఎంపిక చేశారు.

కన్నడ మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఆషిక..తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోబోతుంది. ఇందులో అశికాతో పాటుగా మరో హీరోయిన్కి కూడా​ రోల్​ ఉండనున్నట్టు సమాచారం.

విజయ్​ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.