
హాలియా, వెలుగు: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. సాగర్‌కు 70038 క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. దీంతో సాగర్ 2 క్రస్ట్ గేట్లను 5 ఫీట్లు ఎత్తి 16012 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
కాగా సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి నిలువ సామర్థ్యం 590 అడుగుల( 312. 0450 టీఎంసీల)కు గాను ప్రస్తుతం రిజర్వాయర్ లో 589.10 అడుగులు ( 309.3558 టీఎంసీ )ల నీటి నిల్వ ఉంది. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32277 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9700 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 9349 క్యూసెక్కులు, ఎమ్మార్పీ ద్వారా 2400 క్యూసెక్కులు, ఎల్ఎల్సీ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లో గా వదులుతున్నారు.