
జనగామ, వెలుగు: ఈ నెల 15న నిర్వహించనున్న కామారెడ్డి బీసీ మహాసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకుడు నాగపురి కిరణ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ లో రూ.4 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో దూడల సిద్ధయ్య, గనిపాక మహేందర్, నూకల బాల్‌రెడ్డి, కొత్త కరుణాకర్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.