- మళ్లీ దొంగతనం చేసిన నేరస్తుడు
నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం చేసిన నేరస్తుడు రుద్రాక్షి శ్రీనును పోలీసులు అరెస్టు చేశారు. పంచాయతీ కార్యదర్శి జెర్రిపోతుల రవి ఇంట్లో బంగారం, నగదు, బైక్ దొంగిలించాడు. కనకదుర్గ కాలనీలో మరో ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. బాధితులు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. మునుగోడు రోడ్డులో వెహికల్ చెకింగ్ సమయంలో శ్రీనును పట్టుకున్నారు.
విచారణలో నేరం ఒప్పుకున్నాడు. రూ.12 లక్షల విలువైన బంగారం, వెండి, బైక్ స్వాధీనం చేశారు. రుద్రాక్షి శ్రీను గతంలో 40కి పైగా దొంగతనాలు చేసినట్టు తెలిసింది. కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
