ఈ కథలో కూడా అమ్మలేదా..హృదయాన్ని హత్తుకునేలా..హాయ్ నాన్న ట్రైలర్

ఈ కథలో కూడా అమ్మలేదా..హృదయాన్ని హత్తుకునేలా..హాయ్ నాన్న ట్రైలర్

నాని (Nani) హీరోగా..శౌర్యవ్ (Shouryuv) డైరెక్షన్ లో వస్తోన్న మూవీ హాయ్ నాన్న(Hi Nanna).  నాని 30వ  సినిమాగా రిలీజ్కు సిద్దమయ్యింది. లవ్ స్టోరీ, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ మేళవింపుతో ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. మొత్తంగా 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఈ ట్రైలర్ ఆడియాన్స్ను మెస్మరైజ్ చేస్తోంది.ఇందులో ప్రతి క్యారెక్టర్ మధ్య వచ్చే సీన్స్..డైలాగ్స్ ఆలోచింపజేస్తున్నాయి. 

తన అమ్మ కథ చెప్పాలని కూతురు మహి అడుగుతుండగా..అనగనగా ఒక ఊరు..ఆ ఊరిలో ఒక అద్భుతం..అందులో నేను ఒంటరి అని నాని అంటాడు..మరి అమ్మగా ఎవర్ని ఊహించుకోవాలని మహి అడగగా..అమ్మగా తననే ఊహించుకోవాలని మృణాల్ చెప్పడం..ఇక తన లవ్ స్టోరీని నాని చెబుతాడు. ఏదో ఒక రోజు అబద్దం లేకుండా కథ చెప్పాలంటూ..నటుడు జయరామ్ అనడంతో..ఆ తర్వాత భార్యతో గొడవలు పడి  నాని విడిపోయినట్టుగా ఈ ట్రైలర్‌లో ఆసక్తిగా చూపించారు డైరెక్టర్.

ట్రైలర్ చివర్లో గాఢమైన ఎమోషనల్‍ తో గుండెను బరువెక్కించారు నాని. “నా ప్రేమ సరిపోవడం లేదా మహీ” అని ఎమోషనల్‍గా నాని డైలాగ్ చెబితే..ఇంకా చెప్పొద్దు ఇంటికి వెళ్లిపోదాం నాన్న అని..మహి అతడిని హత్తుకుంటుంది. బరువైన ఎమోషన్తో గుండెల్లో కన్నీళ్లు నింపిన హాయ్ నాన్న..నానికి మరో జెర్సీ అవుతుందనడంలో సందేహం లేదు. హాయ్ నాన్న సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు.ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన గ్లింప్స్‌తో పాటు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ సినిమాలో విరాజ్ పాత్రలో నాని, యష్న క్యారెక్టర్‌ను మృణాల్ థాకూర్ చేశారు. నాని కూతురి పాత్రలో బేబి కియారా ఖన్నా నటించారు. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.