Saripodhaa Sanivaaram: స్థిర శనివారం సమవర్తి..పోస్టర్ తోనే నాని హై లెవల్ ఇంపాక్ట్

Saripodhaa Sanivaaram: స్థిర శనివారం సమవర్తి..పోస్టర్ తోనే నాని హై లెవల్ ఇంపాక్ట్

నేచురల్ స్టార్ నాని(Nani) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(Saripodhaa Sanivaaram).దర్శకుడు వివేక్ ఆత్రేయ(Vivek Athreya) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మొహనన్(Priyanka Mohanan) హీరోయిన్ గా నటిస్తున్నారు. 

డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ నటుడు SJ సూర్య కీ రోల్ చేస్తున్నారు. అంటే సుందరానికి వంటి సినిమా తరువాత  నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో సరిపోదా శనివారంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

లేటెస్ట్గా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.శనివారం రోజున మూవీ టీమ్ ఇచ్చిన అప్ డేట్ నాని ఫ్యాన్స్ లో మంచి ఊపు తీసుకొచ్చింది.‘స్థిర శనివారం సమవర్తి’ అంటూ నాని చేతికి రక్తం కారుతున్న ఫొటోను మేకర్స్ రిలీజ్ చేశారు.ఆ పోస్టర్ ను చూస్తే యాక్షన్ సీన్ కు సంబంధించినడి కావడంతో దసరా వైబ్స్ తీసుకొచ్చింది. అందులో కనిపిస్తున్న చెయ్యి కి రక్తం కారుతూ కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పోస్టర్ లో నాని హ్యాండ్ చాలా రఫ్ గా కనిపిస్తూనే..హైప్ ఇచ్చేస్తోంది. ప్రస్తుతం ఈ లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రీసెంట్గా రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ తోనే సినిమా ఎంత ఇంటెన్సిఫైడ్ గా ఉండనుందో తెలిసిపోయింది. అందులో 'కోపం అనేది ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. కానీ, ఆ కోపాన్ని కూడా క్రమబద్ధంగా, పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా? నేను చూశా. వాడి పేరు సూర్య.. రోజు శనివారం.. అంటూ SJ సూర్య చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. అంతేకాదు నాని లుక్స్ కూడా సరికొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 

ఈ సారి డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సాలిడ్ స్క్రిప్ట్ తో..నానికి హిట్ ఇవ్వాలని గట్టిగా ఫిక్స్ అయ్యినట్టుగా టైటిల్ గ్లింప్స్ ఉంది.ఈ మూవీకి జేక్స్ బేజోయ్ సంగీతం అందిస్తున్నారు.  ఆగస్టు 29న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.