
- అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లో నానో బనానా ట్రెండ్ వైరల్
- ఖర్చు, టెక్నికల్ స్కిల్స్ అక్కరలేకపోవడంతో తెగవాడేస్తున్న యూజర్లు
- కంటెంట్ క్రియేషన్‌కు కూడా ఉపయోగిస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్‌లు
- విజువల్లీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ వల్ల వేగంగా ప్రజాదరణ
న్యూఢిల్లీ: ప్రస్తుతం సోషల్ మీడియాలో 'నానో బనానా' అనే ట్రెండ్ బాగా వైరల్ అవుతున్నది. చిన్నగా, ముద్దుగా, అట్రాక్టీవ్ గా కనిపిస్తున్న3డీ ఫిగరిన్స్(3డీ బొమ్మ వంటి ఫొటోలు) ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. వాట్సాప్ స్టేటస్ లు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ 3డీ బొమ్మలతో నిండిపోయాయి. అయితే, వీటిని ఎలాంటి ఖర్చు లేకుండా, ఎవరైనాసరే కేవలం సెకన్లలో గూగుల్ జెమిని (జెమిని 2.5 ఫ్లాష్) ఇమేజ్ టూల్‌తో క్రియేట్ చేయవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో రుపొందించిన ఈ ట్రెండ్‌కు “నానో బనానా” అని ముద్దు పేరు పెట్టారు.
యూజర్లు కేవలం ఒక ఫొటో లేదా చిన్న టెక్స్ట్ ప్రాంప్ట్ ఉపయోగించి తమ సొంత హైపర్- రియలిస్టిక్ 3డీ బొమ్మలను క్రియేట్ చేస్తున్నారు. ప్రాంప్ట్ ప్రకారం..3డీ ఫిగరిన్ ఇమేజ్‌లలో ఫిగరిన్ కంప్యూటర్ డెస్క్ మీద ఉంటుంది. ఫిగరిన్ ఒక రియలిస్టిక్ ఎన్విరాన్‌మెంట్‌లో ముఖ్యంగా కంప్యూటర్ డెస్క్ మీద ట్రాన్స్‌పరెంట్ ఆక్రిలిక్ బేస్‌పై ప్లేస్ చేస్తుంది. సమీపంలోని కంప్యూటర్ స్క్రీన్‌పై ఫిగరిన్ 3డీ మోడలింగ్ ప్రాసెస్ కనిపిస్తుంది. దాని పక్కన టాయ్ ప్యాకేజింగ్ బాక్స్ కూడా ఉంటుంది. ఇది ఫిగరిన్‌ను మరింత రియలిస్టిక్‌గా, కమర్షియల్ కలెక్టిబుల్ టాయ్ లాగా మారుస్తున్నది. తమకు నచ్చిన సెలబ్రిటీలను, పెంపుడు జంతువులను కూడా చాలా మంది 3డీ బొమ్మలుగా మార్చేస్తూ సంబరపడిపోతున్నారు.
ఎందుకింత ట్రెండ్ అయిందంటే..!
నానో బనానా అనేది ఒక ఫొటో ఎడిటింగ్ టూల్. ఇది జెమినీ యాప్లేదా వెబ్‌సైట్‌లో లో ఫొటో ఎడిటింగ్ టూల్ అప్డేటెడ్ వెర్షన్. దీని సాయంతో ఫొటోలను మనకు నచ్చినట్లుగా కేవలం ఒకటి లేదా రెండు సెకన్లలోనే ఎడిట్చేయొచ్చు. ఉదాహరణకు దీనిలో మీరు ఒక ఫొటోను అప్‌లోడ్ చేసి '3డీ ఇమేజ్' అనే ప్రాంప్ట్ ఇస్తే చాలు. వెంటనే అది అట్రాక్టీవ్ 3డీ ఫొటోలను క్రియేట్ చేసి ఇస్తుంది. సింప్లిసిటీ, యాక్సెసిబిలిటీ, విజువల్లీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ వల్ల ఇది చాలా వేగంగా ప్రజాదరణ పొందింది. పైగా ఈ 3డీ బొమ్మలను క్రియేట్ చేయడానికి ఎలాంటి టెక్నికల్ స్కిల్స్, డబ్బు అవసరం లేదు. యూజర్లు.. మినియేచర్, లైఫ్‌లైక్ ఫిగరిన్లను రియలిస్టిక్ గా సృష్టించవచ్చు. ట్రాన్స్‌పరెంట్ ఆక్రిలిక్ బేస్‌లు, డీటైల్డ్ ప్యాకేజింగ్ మాకప్‌లతో, కమర్షియల్ కలెక్టిబుల్ ఫిగర్‌లు క్రియేట్ చేయవచ్చు.
యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్ లేదా ఫోటో + ప్రాంప్ట్ కాంబినేషన్ వాడితే.. ఏఐ దానికి ఎక్స్‌ప్రెషన్స్, బట్టల టెక్స్చర్, బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ జోడించి ఔట్‌పుట్‌ను న్యాచురల్ గా ఇస్తుంది. అలా ఈజీ ప్రాసెస్ కు యూజర్ల క్రియేటివిటీ తోడవడంతో నానో బనానా ట్రెండ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.పెద్ద పెద్ద సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, రాజకీయ నాయకులు కూడా తమ నానో బనానా ఫిగరిన్స్ పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ ఊపందుకుంది. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా తన సొంత 3డీ ఫిగరిన్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త ట్రెండ్ ను ఫాలో కావాలని యువతకు సూచించారు.
మరిన్ని ఉపయోగాలేంటంటే..?
నానో బనానాతో 3డీ ఫిగరిన్స్ క్రియేషన్స్ లాగా మరెన్నో ఉపయోగాలున్నాయి. గ్రాఫిక్ డిజైనర్లు, యానిమేటర్లు, గేమ్ డెవలపర్‌లు తమ స్కెచ్‌లు లేదా డిజైన్‌లను 3డీ ఫిగరిన్‌లుగా మార్చి తమ పోర్ట్‌ఫోలియోలను మెరుగుపరచవచ్చు. తమ ఆలోచనలను రియలిస్టిక్ ఫార్మాట్‌లో చూడవచ్చు. ఫ్యామిలీ ఫొటోలను ఫిగరిన్‌గా మార్చి బర్త్ డే, పెండ్లి గిప్టులుగా ఇవ్వచ్చు. 3డీ ఫిగరిన్స్ క్రియేషన్స్ తో సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ కూడా చేయవచ్చు.
ఇన్‌ఫ్లూయెన్సర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లు తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి ఈ ట్రెండ్‌ను ఉపయోగిస్తున్నారు. ఎడ్యుకేషనల్ టూల్ గా కూడా 3డీ ఫిగరిన్స్ క్రియేషన్స్ వాడవచ్చు. ఆర్ట్ ప్రొఫెసర్లు ఈ ట్రెండ్ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పవచ్చు. విద్యార్థులు కూడా తమ డిజైన్‌లను 3డీలో విజువలైజ్ చేయడానికి, ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్‌లో ఉపయోగించవచ్చు. 3డీ మోడలింగ్, డిజైన్ సాఫ్ట్‌వేర్ గురించి నేర్చుకోవడానికి ఇదొక మంచి టూల్ గా చెప్పవచ్చు.