ఎరువులు ఎక్కువ ధరకు అమ్మొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఎరువులు ఎక్కువ ధరకు అమ్మొద్దు : కలెక్టర్ సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్​ (నారాయణ పేట), వెలుగు: జిల్లాలో ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవని నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 80 శాతం ఎరువుల విక్రయాలు సాఫీగా సాగాయని, మరో పక్షం రోజుల పాటు ఎరువుల పంపిణీ చేస్తామని చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎరువుల డీలర్లతో సమీక్ష నిర్వహించారు.

డీలర్లు ఎరువుల క్రయవిక్రయాల్లో నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఎరువులు తప్పని సరిగా ఈ - పాస్ ద్వారానే అమ్మాలని, ప్రతి రోజు క్లోసింగ్, బ్యాలెన్స్ నమోదు చేయాలని చెప్పారు. డీఎస్పీ లింగయ్య,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్, ఏవోలు ఏఈవోలు, డీలర్లు పాల్గొన్నారు.