కరువుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలవి అబద్ధాలు: కోదండరెడ్డి

కరువుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలవి అబద్ధాలు: కోదండరెడ్డి
  • కరువుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలవి అబద్ధాలు
  • కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: కరువు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నాయని కిసాన్ కాంగ్రెస్  జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అన్నారు. తప్పుడు చావు లెక్కలను సీఎస్‌‌‌‌కు బీఆర్ఎస్ నేతలు పంపారని, అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 63 మంది చనిపోయారని తెలిపారు. అందులో సగం మంది మాత్రమే సూసైడ్  చేసుకున్నారని వెల్లడించారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో కోదండ రెడ్డి మాట్లాడారు.

 మొన్నటి వరకు బీఆర్ఎస్  అధికారంలో ఉందని, కరువుకు కాంగ్రెస్  ప్రభుత్వం కారణం అనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో  కరువు ఉందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కరువు ఉన్న రాష్ట్రాలను ఆదుకుందని గుర్తుచేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా కరువుకు కాంగ్రెస్ కారణం అన్నట్లు మాట్లాడుతన్నారని దుయ్యబట్టారు. డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్‌‌ కింద కరువు ప్రాంతాలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కరువుపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నా.. ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.