నయనతార లేటెస్ట్ పోస్ట్ వైరల్..హీరోయిన్గా ఇక కనిపించకపోవచ్చు!

నయనతార లేటెస్ట్ పోస్ట్ వైరల్..హీరోయిన్గా ఇక కనిపించకపోవచ్చు!

సౌత్‌ లేడీ సూపర్ స్టార్‌ నయనతార..హీరోయిన్గా..మదర్గా..భార్యగా..బిజినెస్మేన్గా,ప్రొడ్యూసర్గా తన వంతు బాధ్యతతో కెరీర్ రన్ చేస్తుంది. అంతేకాకుండా నయన్ సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకోవడం విశేషం.స్టార్ స్టేటస్తో సక్సెస్ ఫుల్ లైఫ్ను లీడ్ చేస్తూనే..మరో కొత్త టాలెంట్ను బయటకు తీసుకోచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం నయన్..సోషల్ మీడియాలో 'కొత్తగా ప్రారంభిస్తోన్న మ్యాజిక్‌ను విశ్వసించండి..అంటూ ట్యాగ్తో పోస్ట్ చేయడం అందరికి ఆశ్చర్యం కలిగేలా చేస్తోంది.
  
కెమెరా ముందు ఇన్నాళ్లు స్టార్ స్టేటస్ పొందిన నయనతార..ఇప్పుడు కెమెరా వెనుక నిలవబోతోందని లేటెస్ట్ ఫోటోతో అర్థమవుతోంది.దీంతో నయనతార త్వరలో ఒక సినిమాను డైరెక్ట్ చేయబోతోందని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ క్రేజ్ ఉన్న టైంలోనే డైరెక్షన్పై ఉన్న ఇంట్రెస్ట్తో రూట్ మార్చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా నయన్ దర్శకత్వం వైపు వస్తుండటంతో ఫ్యాన్స్ విషెష్ చెబుతున్నారు.నార్త్, సౌత్ అనే తేడా లేకుండా వరుస భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ..హిట్స్ మీద హిట్స్ అందుకుంటోన్నఈ బ్యూటీ ఏ రంగంలో దిగిన..సక్సెస్ అందుకోవడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నయనతార భర్త విఘ్నేష్‌ శివన్ కూడా దర్శకుడు అనే విషయం తెలిసిందే.

ప్రస్తుతం నయనతార ప్రధాన పాత్రలో ‘అన్నపూరణి' (Annapoorani) అనే సినిమాను దర్శకుడు నీలేష్ కృష్ణ తెరకెక్కిస్తున్నారు. నయనతారకు ఇది 75వ మూవీ కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు శంకర్‌ శిష్యుడే డైరెక్టర్ నీలేష్‌ కృష్ణ. జై, సత్యరాజ్‌, కార్తీక్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇటీవల షారుక్​ ఖాన్తో నయన్​జవాన్​లో నటించింది. ఈ మూవీతో హిందీ ఆడియెన్స్ను సైతం మెస్మరైజ్​చేసింది. తొలి సినిమానే బ్లాక్​బస్టర్​హిట్ కొట్టడంతో..ఇప్పుడు బాలీవుడ్​దర్శక నిర్మాతలు నయన్​కోసం కడుతున్నారు. దీంతో తన క్రేజ్కి తగ్గట్టే రెమ్యూనరేషన్ను కూడా భారీగా పెంచిందని టాక్.