- నీలం మధు ముదిరాజ్ ధీమా
- షేక్ పేటలో ఎన్నికల ప్రచారం
బంజారాహిల్స్, వెలుగు: అభివృద్ధి సంక్షేమాలే ప్రధాన ఎజెండాగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పని చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జీ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట్ డివిజన్ పరిధిలోని వినోబా నగర్, సాయి రామ్ నగర్, సీతా నగర్ కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, బీజేపీ అగ్రవర్ణాలకు టికెట్లు ఇస్తే కాంగ్రెస్ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ ను బరిలో నిలిపిందన్నారు.
బీసీలను మోసం చేస్తున్న ఈ రెండు పార్టీలకు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్కాంగ్రెస్ గెలుపు ఖామయని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షేక్ పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు మురారి గాంధీ, బాలకృష్ణ, విగ్నేష్, బాబురావు, సతీశ్ తదితరులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.
