టిల్లు స్క్వేర్‌ లో సర్ర్పైజ్‌లా రాధిక

టిల్లు స్క్వేర్‌ లో  సర్ర్పైజ్‌లా రాధిక

‘డీజే టిల్లు’ చిత్రంతో హీరోగా సిద్ధు జొన్నలగడ్డకు ఎంత పేరు వచ్చిందో.. రాధిక పాత్ర పోషించిన నేహా శెట్టికి అంతే క్రేజ్ వచ్చింది. నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ అయినప్పటికీ తన పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌, గ్లామర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యూత్‌‌‌‌‌‌‌‌లో చక్కని ఫాలోయింగ్ పెంచుకుంది నేహా శెట్టి. అయితే ఈ మూవీకి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కుతున్న ‘టిల్లు స్వ్వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో ఆమె నటించడం లేదనే విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. రాధిక పాత్ర ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌తోనే కంప్లీట్ అయిందని చెప్పారు మేకర్స్. అయితే సీక్వెల్‌‌‌‌‌‌‌‌లో నేహా శెట్టి గెస్ట్‌‌‌‌‌‌‌‌ అప్పియరెన్స్‌‌‌‌‌‌‌‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌లో కొద్ది నిముషాల పాటు తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుందట.  ఇందుకోసం ఆమెను సంప్రదించగా ఓకే చెప్పడం, ఇటీవల తన పార్ట్‌‌‌‌‌‌‌‌ షూటింగ్‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్ చేయడం జరిగిందనే  టాక్ వినిపిస్తోంది. ప్రేక్షకులకు దీన్నొక సర్ర్పైజ్‌లా ప్లాన్ చేశారట టీమ్. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ‘టిల్లు’ ఫ్యాన్స్ కూడా రాధిక మరోసారి తనతో కలిసి కనిపిస్తే చూడాలని కోరుకుంటున్నారు. 

మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఇక శుక్రవారం ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న నేహాశెట్టి.. రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో నటిస్తోంది.