
పర్వతగిరి(గీసుగొండ), వెలుగు: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు కొత్త బస్ సర్వీస్ ను సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు.
ఈ బస్సు ఊకల్ హవేలీ, కోనాయమాకుల, ధర్మారం, జాన్ పీరిల్, వరంగల్ బస్టాండ్ వరకు వెళ్తుందని, ఉచిత బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో టీజీఐడీసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి నాయక్, ఆర్డీవో సత్య పాల్ రెడ్డి, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, యంగ్ వన్, గణేశా మేనేజర్ లు కృష్ణమూర్తి, ఎంవీ రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.