సంచలన విషయాలు బయటపెడుతున్న రాస్ టేలర్

సంచలన విషయాలు బయటపెడుతున్న రాస్ టేలర్

న్యూఢిల్లీ: క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌కు గుడ్‌‌‌‌బై చెప్పిన న్యూజిలాండ్‌‌‌‌ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ రాస్‌‌‌‌ టేలర్‌‌‌‌.. తన ఆత్మకథ ‘బ్లాక్‌‌‌‌ అండ్‌‌‌‌ వైట్‌‌‌‌’లో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. తాజాగా.. 2011 ఐపీఎల్‌‌‌‌ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌‌‌‌ ఓనర్‌‌‌‌ ఒకరు తనను చెంప మీద కొట్టాడని ఆరోపణలు చేశాడు. మొహాలీలో పంజాబ్‌‌‌‌తో జరిగిన మ్యాచ్‌‌‌‌ సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నాడు. ‘మేం 195 రన్స్‌‌‌‌ ఛేదించాల్సి ఉంది. కానీ నేను ఎల్బీగా డకౌటయ్యా. ఆ మ్యాచ్‌‌‌‌లో మేం ఓడిపోయాం.

తర్వాత హోటల్‌‌‌‌ టాప్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌లో ఉన్న బార్‌‌‌‌ దగ్గర టీమ్‌‌‌‌, సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ అందరూ సమావేశమయ్యారు. లిజ్‌‌‌‌ హుర్లే, షేన్‌‌‌‌ వార్న్‌‌‌‌ కూడా ఉన్నారు. అప్పుడు రాయల్స్‌‌‌‌ ఓనర్‌‌‌‌ ఒకతను.. రాస్‌‌‌‌ నీ డకౌట్‌‌‌‌కు మిలియన్‌‌‌‌ డాలర్లు ఇవ్వలేం.. అంటూ నవ్వుతూనే నా చెంప మీద మూడు, నాలుగుసార్లు కొట్టాడు. ఆ పరిస్థితుల్లో దాన్ని పెద్దదిగా చేయాలనిపించలేదు. కానీ ఓ ప్రొఫెషనల్‌‌‌‌ స్పోర్టింగ్‌‌‌‌లో ఇలా జరుగుతుందని ఊహించలేదు’ అని టేలర్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.