నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం.. కుక్క నోట్లో ఆడశిశువు మృతదేహం

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం.. కుక్క నోట్లో  ఆడశిశువు మృతదేహం

నల్గొండ, వెలుగు : అప్పుడే పుట్టిన ఆడ శిశువును కొందరు గుర్తు తెలియనివ్యక్తులు కవర్లో చుట్టి పడేయగా.. కుక్క నోట కరుచుకొని పోయింది. దీనిని గమనించిన స్థానికులు కుక్కను తరిమేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని విద్యానగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీలో సోమవారం ఓ కుక్క ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నోట కరుచుకొని వెళ్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు కుక్కను తరిమేసి కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విప్పి చూశారు. 

అందులో అప్పుడే పుట్టిన ఆడ శిశువు డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీ కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. శిశువును ఎవరు పడేసి వెళ్లారు అనే వివరాలు తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిశీలిస్తున్నారు.