నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించాలి

నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించాలి

నిర్మల్, వెలుగు: వినాయక నిమజ్జన వేడుకలు ప్రజలంతా ఘనంగా నిర్వహించుకోవాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకాంక్షించారు. నిర్మల్ పట్టణం భాగ్యనగర్ కాలనీలోని గణేశుడిని కలెక్టర్ గురువారం  దర్శించుకున్నారు. మండపలంలో పూజలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణంలో వినాయక శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. వినాయకుని నిమజ్జనం సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు. 

ఈ సందర్భంగా నిర్వహకులు కలెక్టర్​ను శాలువాతో సన్మానించి, మెమోంటోలను అందజేశారు. అనంతరం సమీపంలోని రాధాకృష్ణ మందిరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.