మాతాశిశు మరణాలపై కలెక్టర్ సీరియస్

మాతాశిశు మరణాలపై కలెక్టర్ సీరియస్
  • విచారణ జరిపి నివేదికకు ఆదేశం

నిజామాబాద్​,  వెలుగు:  జిల్లాలో ప్రసవాల కోసం వచ్చిన గర్భిణులు ప్రసవాల తరువాత మరణించడం, పుట్టిన శిశువులు కూడా మృతి చెందిన ఉదంతాలను కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సీరియస్​గా పరిగణించారు. మంగళవారం ఆయన మాతాశిశు మరణాల నిరోధక కమిటీ  మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. నిపుణులైన డాక్టర్లు, సిబ్బంది ఉన్న తరువాత ఇలా ఎందుకు జరిగిందో విచారణ చేసి తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్​ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​లో జరిగిన మాతాశిశు మరణాలను ఒక్కొక్కటిగా సమీక్షించారు. 

విచారణలో డాక్టర్ల నిర్లక్ష్యం అని తేలితే సీరియస్​ యాక్షన్​ ఉంటుందన్నారు. గర్భిణులకు క్రమంగా హెల్త్​ చెకప్ చేయాలని, పుట్టింటికి వెళ్తే వారి రికార్డులను అక్కడి మెడికల్ ఆఫీసర్లకు పంపాలన్నారు. నర్సింగ్​ హోమ్​లో క్వాలిఫైడ్ డాక్టర్లతోనే ప్రసవాలు చేయించాలన్నారు. స్కానింగ్​ సెంటర్లు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కేసులు నమోదు చేయాలన్నారు. అడిషనల్​కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి, డీఎంహెచ్​వో డాక్టర్​ రాజశ్రీ, జిల్లా సంక్షేమ అధికారణి రసూల్​బీ, జీజీహెచ్​ సూపరింటెండెంట్​ శ్రీనివాస్ ఉన్నారు.

ఎలక్షన్ డ్యూటీలపై నిర్లక్ష్యం వద్దు..

గ్రామ పంచాయతీ ఎన్నికల మాదిరి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు యంత్రాంగం రెడీగా ఉండాలని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో జీపీ ఎన్నికల సక్సెస్​ మీట్​ నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల విధులు సవాళ్లతో కూడి ఉంటాయ న్నారు. అడిషనల్​కలెక్టర్లు అంకిత్​, కిరణ్​కుమార్, డీపీవో శ్రీనివాస్​రావు, జడ్పీ సీఈవో సాయాగౌడ్​, ఏవో రాజబాబు ఉన్నారు.