- నిజామాబాద్జిల్లాలో 155 సర్పంచ్లు, 1,060 వార్డులు,
- కామారెడ్డి జిల్లాలో 156 సర్పంచ్లు, 1,087 వార్డులకు ఎన్నికలు
- నేటి నుంచి పల్లెల్లో ప్రచారం షురూ
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొలి విడత బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో 184 గ్రామ పంచాయతీల్లో 29 గ్రామపంచాయతీల సర్పంచ్లు, 1642 వార్డుల్లో 575 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి డివిజన్లో 167 పంచాయతీల్లో 11 గ్రామాల్లో సర్పంచ్లు, 1,520 వార్డుల్లో 433 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నిజామాబాద్జిల్లాలో 155 సర్పంచ్ స్థానాలు, 1,060 వార్డులకు, కామారెడ్డి జిల్లాలో 156 సర్పంచ్‌స్థానాలకు, 1,084 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి ప్రచారం షురూ కానున్నది. దీంతో బరిలో ఉంటే అభ్యర్థులు కులసంఘాలు, యూత్సొసైటీల మద్దతు కూడగట్టుకునే పనిలో నిమగ్నం కానున్నారు. ఈ నెల 11న తొలి విడత పోలింగ్ జరగనున్నది.
నిజామాబాద్ జిల్లాలో ఇలా...
నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్లో 155 పంచాయతీలకు 519 సర్పంచ్ అభ్యర్థులు, 1,060 వార్డులకు 2,734 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 29 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో రుప్లానాయక్ తండా, సిద్దాపూర్, వకీల్‌ఫారం, అఫందీఫారం, సైద్పూర్, శంకోరా, రాజ్పేట్, చలకతండా, చింతల్‌పేట్ తండా, మల్లారం, మావందికలాన్, భూలక్ష్మీక్యాంప్, పెంటాకలాన్, పెంటాఖుర్దు క్యాంప్, సాలూరా క్యాంప్, సాలంపాడ్, ఫత్తేపూర్, రాంపూర్, అడ్కాస్పల్లి, సుద్దులం తండా, వల్లభాపూర్, దేవునిగుట్ట తండా, లక్ష్మాపూర్, కారేగావ్, పీఎస్ఆర్ నగర్, బాపూనగర్, దండిగుట్ట, నారాయణపూర్, సిరన్‌పల్లి ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలో ఇలా..
కామారెడ్డి జిల్లాలో 156 పంచాయతీలకు 733 మంది సర్పంచ్అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సగటున ఒక్కో స్థానానికి ఐదుగురు పోటీ పడుతున్నారు. 1,084 వార్డులకు 33,240 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలో 11 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, వేనుకతండా, బోడగుట్టతండా, అంకిరెడ్డిపల్లితండా, సదాశివనగర్ మండలంలో తుక్కోజివాడి, తిర్మన్‌పల్లి, సజ్జనాయక్ తండా, రాజంపేట మండలంలో శేర్శంకర్తండా, గుడి తండా, బీబీపేట మండలంలో శివారు రాంరెడ్డిపల్లి, పాల్వంచ మండలంలో భవానిపేట తండా ఉన్నాయి.
నిజామాబాద్జిల్లాలో బరిలో నిలిచిన ఫస్ట్ విడత సర్పంచ్ అభ్యర్థులు వీరే..
మండలం మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థుల
జీపీలు సంఖ్య జరిగే జీపీలు సంఖ్య
బోధన్ 26 04 24 67
చందూర్ 05 02 03 14
కోటగిరి 16 05 11 41
మోస్రా 05 – 05 19
పోతంగల్ 20 01 19 60
రుద్రూర్ 11 – 11 39
రెంజల్ 17 01 16 55
సాలూరా 12 03 09 28
వర్ని 23 10 13 39
ఎడపల్లి 17 01 16 58
నవీపేట 32 02 30 99
కామారెడ్డి జిల్లాలో బరిలో నిలిచిన ఫస్ట్ విడత అభ్యర్థులు వీరే..
మండలం మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థుల
జీపీలు సంఖ్య జరిగే జీపీలు సంఖ్య
భిక్కనూరు 18 – 18 80
బీబీపేట 11 1 10 51
దోమకొండ 9 – 9 47
కామారెడ్డి 14 – 14 67
మాచారెడ్డి 25 4 21 110
పాల్వంచ 12 1 11 59
రాజంపేట 18 2 16 78
రామారెడ్డి 18 – 18 85
సదాశివనగర్ 24 3 21 82
తాడ్వాయి 18 – 18 74
మొత్తం 167 11 156 733
ఫస్ట్ విడత వార్డుల అభ్యర్థులు వీరే..
మండలం మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థుల
వార్డులు జరిగే జీపీలు సంఖ్య
బోధన్ 228 97 131 280
చందూర్ 48 21 26 70
కోటగిరి 130 80 50 127
మోస్రా 52 06 46 132
పోతంగల్ 166 62 102 290
రుద్రూర్ 100 11 88 218
రెంజల్ 166 35 130 342
సాలూరా 112 40 72 153
వర్ని 186 86 100 311
ఎడపల్లి 166 42 123 346
నవీపేట 288 95 192 465
ఫస్ట్ విడత వార్డుల అభ్యర్థులు వీరే..
మండలం మొత్తం ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థుల
వార్డులు జరిగే జీపీలు సంఖ్య
భిక్కనూరు 182 28 154 490
బీబీపేట 110 24 86 265
దోమకొండ 96 14 82 250
కామారెడ్డి 120 13 107 303
మాచారెడ్డి 196 94 102 394
పాల్వంచ 12 1 11 59
రాజంపేట 158 58 100 269
రామారెడ్డి 166 38 125 381
సదాశివనగర్ 214 86 128 328
తాడ్వాయి 168 57 111 274
మొత్తం 1,520 433 1,084 3,240
