
- బారికేడ్లు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సిబ్బంది
వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. జలపాతం వద్ద ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. ఛత్తీస్గఢ్అడవుల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి జలపాతానికి భారీగా వరద వస్తోంది.
వాటర్‌ఫాల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మంగళవారం ఓ యువకుడు గల్లంతై చనిపోయాడు. దీంతో ఆఫీసర్లు అలర్టయ్యారు. సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వస్తున్న వారిని వస్తున్నట్టే వెనక్కి పంపిస్తున్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత మళ్లీ అనుమతిస్తామని తెలిపారు.