
‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అంటూ ‘టెంపర్’ సినిమాలోని ఐటం సాంగ్‌తో టాలీవుడ్‌కి పరిచయమైన బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహీకి... ‘బాహుబలి’లోని మనోహరి పాట మరింత క్రేజ్ తీసుకొచ్చింది. కిక్ 2, షేర్, లోఫర్ లాంటి సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేసిన ఆమె.. చివరగా ‘ఊపిరి’ చిత్రంలో కనిపించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుణ్ తేజ్ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇస్తోంది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
బుధవారం కొత్త అప్‌డేట్ ఇస్తూ.. నోరా ఫతేహి ఇందులో కీలకపాత్ర పోషిస్తోందని మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఇందులోని ఓ స్పెషల్ సాంగ్‌లో కూడా ఆమె కనిపించబోతోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తామని నిర్మాతలు చెబుతున్నారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కే ఈ పీరియాడికల్ మూవీ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమవుతోంది.