రుచికే కాదు.. ఆరోగ్యానికీ పుదీనా

రుచికే కాదు.. ఆరోగ్యానికీ పుదీనా

డైలీ డైట్​లో చేర్చితే  హెల్త్​ ప్రాబ్లమ్స్​కి టాటా
ఘాటు వాసనతో.. వంటల రుచిని  పెంచే పుదీనాతో మరెన్నో  లాభాలున్నాయి. వీటిని  డైలీ డైట్​లో చేర్చితే  బోలెడు హెల్త్​ ప్రాబ్లమ్స్​కి టాటా చెప్పొచ్చు. మరి అవేంటంటే... 
 పుదీనాలోని యాంటి ఇన్​ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్​ ప్రాపర్టీలు​ యాక్నే సమస్యల్ని తగ్గిస్తాయి. సాల్సిలిక్​ యాసిడ్  మొటిమలు, మచ్చల్ని మటుమాయం చేస్తుంది. వీటిల్లోని విటమిన్​ –ఎ  కంటి సమస్యల్ని దరిచేరనివ్వదు. నైట్ విజన్​ని పెంచుతుంది. 

రోస్మరినిక్​ యాసిడ్​ అనే యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్​ ఉంటుంది పుదీనాలో. ఇది అలర్జీ ప్రొడ్యూసింగ్​ కాంపౌండ్స్​ని బ్లాక్ చేసి అలర్జీలు రాకుండా చూస్తుంది. ఆస్తమా పేషెంట్స్​కి  ఉపశమనాన్ని ఇస్తుంది.  దగ్గు , జలుబు, ఫ్లూ  లాంటి సమస్యల నుంచి కూడా  రిలాక్సేషన్​ ఇస్తాయి. 
పుదీనా రసంలో శొంఠి, జీలకర్ర పొడి కలిపి తినేముందు తాగితే ఆకలి పెరుగుతుంది. ఈ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే వాంతులు తగ్గుతాయి. వాము పొడితో తీసుకుంటే కడుపులో నులి పురుగులు పోతాయి. పుదీనాలో ఉండే సల్ఫర్‌‌ లంగ్స్​ని కూడా కాపాడుతుంది.  
గ్లాసు నీళ్లలో  పుదీనా ఆకులు కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన పోతుంది.  పుదీనా ఆకులు నమిలితే పళ్లు తెల్లబడతాయి. చిగుళ్లు గట్టి పడి, ఆరోగ్యంగా ఉంటాయి.  
ఫైబర్​ , విటమిన్‌‌–బి కాంప్లెక్స్​, బీటా కెరటిన్, విటమిన్‌‌–సి, విటమిన్‌‌–ఇ, విటమిన్‌‌–కె, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌‌ ​ పుష్కలంగా ఉంటాయి పుదీనాలో. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. 
పుదీనా డైజెషన్​ని మెరుగుపరుస్తుంది. డైజెస్టివ్ ట్రాక్​ డిజార్డర్​ వల్ల వచ్చే  కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది. రెండు స్పూన్​ల  పుదీనా రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. 
పుదీనా రసం రెగ్యులర్​గా తాగితే  డిప్రెష‌‌న్, స్ట్రెస్​ దూరం అవుతాయి.
పుదీనాలో గర్భిణీలకు అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్‌‌, ఒమెగా-–3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. 
పుదీనా ఆకుల్ని డైలీ డైట్​లో చేర్చితే శ‌‌రీరంలో క‌‌ణుతులు పెర‌‌గ‌‌కుండా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్లు కూడా రావు. 
పుదీనా గొంతులో గరగరని తగ్గిస్తుంది.  
పుదీనాతో స్ట్రెస్​ దూరం
పుదీనా  శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే స్ట్రెస్​ని​ బీట్​ చేయడానికి  అరోమా థెరపీలోనూ పుదీనాని వాడతారు. దీనివల్ల మైండ్​, బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే పుదీనాలోని అడాప్టోజెనిక్​ ప్రాపర్టీలు​ శరీరంలో 
కారిస్టాల్​ లెవెల్స్​ని రెగ్యులేట్ చేసి నేచురల్​గానే స్ట్రెస్​ని తగ్గిస్తాయి. అందుకే రెగ్యులర్​గా పుదీనా తినాలి.