జొకో వేట షురూ.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో నొవాక్​, స్వైటెక్​ బోణీ...

జొకో వేట షురూ.. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో నొవాక్​, స్వైటెక్​ బోణీ...

వింబుల్డన్‌‌‌‌‌‌‌‌:కెరీర్‌‌‌‌‌‌‌‌లో 24వ గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్‌‌‌‌‌‌‌‌ వేటలో ఉన్న సెర్బియా టెన్నిస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ నొవాక్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌  వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో శుభారంభం చేశాడు.  తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌ను ఈజీగా దాటేశాడు. అతనితో పాటు ఏడో సీడ్‌‌‌‌‌‌‌‌ ఆండ్రీ రుబ్లెవ్‌‌‌‌‌‌‌‌ కూడా ముందంజ వేశాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ ఇగా స్వైటెక్‌‌‌‌‌‌‌‌, ఐదో సీడ్‌‌‌‌‌‌‌‌ కరోలిన్‌‌‌‌‌‌‌‌ గార్సియా రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టాడు. వింబుల్డన్‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదో టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గి స్విస్‌‌‌‌‌‌‌‌ లెజెండ్‌‌‌‌‌‌‌‌ రోజర్‌‌‌‌‌‌‌‌ ఫెడరర్‌‌‌‌‌‌‌‌ రికార్డు సమం చేయాలని చూస్తున్న నొవాక్‌‌‌‌‌‌‌‌ అందుకు తొలి అడుగు వేశాడు. సోమవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌‌‌‌‌ జొకోవిచ్‌‌‌‌‌‌‌‌ 6–3, 6–3, 7–6 (7/4)తో అన్‌‌‌‌‌‌‌‌ సీడెడ్‌‌‌‌‌‌‌‌ పెడ్రో కచిన్‌‌‌‌‌‌‌‌ (అర్జెంటీనా)ను వరుస సెట్లలో ఓడించి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌ చేరాడు. 2 గంటల 12 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నొవాక్‌‌‌‌‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే సత్తా చాటాడు. వర్షం వల్ల మధ్యలో గంట పాటు ఆటంకం కలిగినా సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, రిటర్న్‌‌‌‌‌‌‌‌ల్లో తన మార్కు చూపెట్టాడు.  మూడో సెట్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే జొకోకు కాస్త ప్రతిఘటన ఎదురైంది. దాన్ని నొవాక్‌‌‌‌‌‌‌‌ టై బ్రేక్‌‌‌‌‌‌‌‌లో గెలిచాడు. ఈ  మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 13 ఏస్‌‌‌‌‌‌‌‌లు కొట్టిన నొవాక్‌‌‌‌‌‌‌‌.. 23 నెట్ పాయింట్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గాడు. 11 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో 4 గెలిచిన అతను 45 విన్నర్లు సంధించాడు. 3 డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌, 19 అన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ ఎర్రర్స్‌‌‌‌‌‌‌‌ చేసిన నొవాక్‌‌‌‌‌‌‌‌ మొత్తం 107 నెగ్గాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో  రష్యా స్టార్‌‌‌‌‌‌‌‌, ఏడో సీడ్‌‌‌‌‌‌‌‌  రుబ్లెవ్‌‌‌‌‌‌‌‌ 6-–3, 7–-5, 6–-4తో ఆస్ట్రేలియాకు చెందిన అన్‌‌‌‌‌‌‌‌సీడెడ్‌‌‌‌‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌‌‌‌‌ పుర్సెల్‌‌‌‌‌‌‌‌ను ఓడించాడు. 17వ సీడ్‌‌‌‌‌‌‌‌ హుబర్ట్‌‌‌‌‌‌‌‌ హుర్కాజ్‌‌‌‌‌‌‌‌ (పోలాండ్‌‌‌‌‌‌‌‌) 6–1, 6–4, 6–4తో ఆల్బర్ట్‌‌‌‌‌‌‌‌ రమోస్‌‌‌‌‌‌‌‌ (స్పెయిన్‌‌‌‌‌‌‌‌)పై విజయం సాధించాడు.

వీనస్‌‌కు చుక్కెదురు

ఈ ఏడాది విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో బరిలో నిలిచిన ఓల్డెస్ట్‌‌ ప్లేయర్‌‌ అయిన అమెరికా వెటరన్​ స్టార్​ వీనస్‌‌ విలియమ్స్‌‌కు తొలి రౌండ్‌‌లోనే చుక్కెదురైంది. 24 సార్లు వింబుల్డన్‌‌ ఆడి ఐదు టైటిల్స్​ గెలిచిన 43 ఏండ్ల వీనస్‌‌ 4–6, 3–6తో  ఉక్రెయిన్‌‌కు చెందిన ఎలినా స్వితోలినా చేతిలో వరుస సెట్లలో ఓడిపోయింది. రెండే బ్రేక్‌‌ పాయింట్లు సాధించిన వీనస్‌‌ 8 డబుల్ ఫాల్ట్స్​, 33 అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్లతో మూల్యం చెల్లించుకుంది. 6 ఏస్‌‌లు కొట్టిన స్వితోలినా 4 బ్రేక్‌‌ పాయింట్లు, 28 విన్నర్లు కొట్టింది. ఒక్క డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేయలేదు. మరో వైపు టాప్​ సీడ్​ స్వైటెక్‌‌‌‌‌‌‌‌ 6–1, 6–3తో జు లిన్‌‌‌‌‌‌‌‌ (చైనా)ను వరుస సెట్లలో చిత్తు చేసింది.  మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నాలుగో సీడ్‌‌‌‌‌‌‌‌ జెస్సికా పెగులా (అమెరికా) 6–2, 6–7 (8/10), 6–3తో  తోటి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ లారెన్‌‌‌‌‌‌‌‌ డేవిస్‌‌‌‌‌‌‌‌పై మూడు సెట్లపాటు కష్టపడి గెలిచింది. ఐదో సీడ్‌‌‌‌‌‌‌‌ గార్సియా (ప్రాన్స్‌‌‌‌‌‌‌‌) 6–4, 6–3తో కెటీ వాలీనెట్స్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించింది. 12వ సీడ్‌‌‌‌‌‌‌‌ కుదెర్మెటోవా (రష్యా) 7–6 (7/4), 6–4తో కైయా కనేపి  (ఎస్తోనియా)పై,  19వ సీడ్‌‌‌‌‌‌‌‌ అజరెంకా (బెలారస్‌‌‌‌‌‌‌‌) 6–4, 5–7, 6–4తో యువాన్‌‌‌‌‌‌‌‌(చైనా)పై గెలిచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌ చేరారు.

కోర్టును తుడిచి

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో నొవాక్‌‌‌‌‌‌‌‌ చాలా షుషారుగా, సరదాగా కనిపించాడు. తొలి సెట్‌‌‌‌‌‌‌‌ను 6–3తో నెగ్గిన తర్వాత వర్షం వల్ల ఆట ఆగిపోయింది. తర్వాత వాన ఆగిన కోర్టులోని గ్రాస్‌‌‌‌‌‌‌‌పై కొంచెం నీళ్లు, తేమ నిలిచాయి. ముఖ్యంగా బేస్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ దగ్గర కాస్త తడిగా ఉండటంతో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ బ్లోవర్లతో ఆరబెట్టే ప్రయత్నం చేశారు. వారికి నొవాక్‌‌‌‌‌‌‌‌ తన వంతు సాయం చేశాడు. ఓ టవల్‌‌‌‌‌‌‌‌ తీసుకొని గడ్డిపై తేమను తుడుస్తూ కనిపించాడు. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లో స్టేడియంలోని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ గట్టిగా అరుస్తూ.. చప్పట్లు కొట్టారు. దాంతో, నొవాక్‌‌‌‌‌‌‌‌ ‘ మాకు మీ హెల్ప్‌‌‌‌‌‌‌‌ కావాలి. గట్టిగా ఊదండి’ అని అన్నాడు.