ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్‌‌ రెడీ

ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్‌‌ రెడీ

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌‌ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. వారి వెయిటింగ్ ముగిసే సమయం దగ్గర పడింది. జనవరి 7న సినిమా రిలీజ్ కాబోతోంది. ఈలోపు వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి. రెండు పాటలు, టీజర్స్‌‌తో సూపర్‌‌‌‌ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు  ట్రైలర్‌‌‌‌తో అదిరే ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. నిజానికి డిసెంబర్ 3న ట్రైలర్‌‌‌‌ విడుదల కావాల్సి ఉంది. కానీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతో వాయిదా వేశారు. ఇప్పుడు మరో కొత్త డేట్‌‌ని లాక్ చేశారు. డిసెంబర్ 9న  ట్రైలర్ విడుదల చేయనున్నట్టు నిన్న కన్‌‌ఫర్మ్ చేశారు. థియేటర్స్‌‌లో కూడా 
ట్రైలర్​ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. ఆలియాభట్‌‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ  కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.