
వాషింగ్టన్: ఇండియాలోని ఒడిశా లో జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందారనే వార్త విని తన హృదయం ముక్కలైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ‘‘రైలు ప్రమాద వార్త నా హృదయాన్ని కలిచివేసింది. జిల్ బైడెన్ కూడా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి న, గాయపడిన వారి గురించి ప్రార్థిస్తున్నాం. కుటుంబ, సాంస్కృ తిక విలువల్లో ఉన్న మూలాలే అమెరికా, ఇండియాలను ఏకం చేస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఇండియన్ల వెంట యావత్ అమెరికా ఉంటుంది. మా ఆలోచన లన్నీ బాధిత కుటుంబాలపైనే ఉన్నాయి” అని తెలిపారు.