సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమా : సీఎం రేవంత్

సింగరేణి కార్మికులకు రూ.కోటి బీమా : సీఎం రేవంత్

సింగరేణి బొగ్గు గనుల్లో పని చేసే కార్మికులకు కోటి ప్రమాద బీమా పథకాన్ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు బాంకర్లతో  బ్యాంకర్లతో మెమోరెండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఒప్పందం చేశారు. గతంలో వచ్చే రూ.40లక్షల ప్రమాద బీమాను రూ.కోటి కి పెంచుతూ పలు బ్యాంకులతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. జీరో ప్రీమియంతో కార్మికులు కోటి రూపాయల వరకూ ఇన్సూరెన్స్ పొందుతారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

ఔట్ సోర్సింగ్ కార్మికులతో కలిపి 43 మంది కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్క తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన  సింగరేణి సంస్థ సీఎండీ బలరాం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కారే భాస్కర్ రావు ఒప్పంద ప్రతాలపై సంతకాలు చేశారు. ఎస్బీఐ, హెచ్ డీఎఫ్సీ పలు బ్యాంకుల ప్రతినిధులు హాజరైయారు. ఇప్పటి వరకూ కోటి రూపాయల బీమా ఆర్మీ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చారని తర్వాత తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు చెల్లిస్తుందని సింగరేణి సీఎండి బలరాం అన్నారు.