కాలేజీ ముందు ఆందోళన.. 15 మంది అమ్మాయిలపై కేసు

కాలేజీ ముందు ఆందోళన.. 15 మంది అమ్మాయిలపై కేసు
  • శివమొగ్గ జిల్లాలో 58 మంది స్టూడెంట్స్​ సస్పెండ్
  • ఆంక్షలను పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం

తుమకూరు/బెంగళూరు: కర్నాటకలో హిజాబ్​గొడవ రోజురోజుకూ ముదురుతోంది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. కాలేజీల మేనేజ్​మెంట్లు మతపరమైన చిహ్నాలతో వచ్చే స్టూడెంట్లను క్లాస్​రూమ్​లోకి రానివ్వకపోడంతో నిరసనలు కొనసాగుతున్నాయి. హిజాబ్​తో వస్తున్న అమ్మాయిలు కాలేజీల ముందు ఆందోళన చేస్తున్నారు. శనివారం తుమకూరు జిల్లాలోని ఎంప్రెస్ ​జూనియర్ ​పీయూ కాలేజీ ముందు ముస్లిం స్టూడెంట్లు​ నిరసనకు దిగారు. హిజాబ్​తో క్లాసు రూమ్​లోకి అనుమతించాలని డిమాండ్​చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని కేసులు పెట్టా రు. కాలేజీలకు 200 మీటర్ల దూరంలో144 సెక్షన్​అమలులో ఉందని, దాన్ని బ్రేక్​ చేసినందుకు కాలేజీ ప్రిన్సిపాల్ ​ఫిర్యాదు మేరకు15మంది అమ్మాయిలపై ఎఫ్ఐఆర్ ​ఫైల్ ​చేసినట్లు పోలీసులు తెలిపారు. చిక్కమగళూరు, శివమొగ్గ, ఉడిపి సహా కర్నాటకలోని పలుచోట్ల స్టూడెంట్లు​ నిరసనలు తెలిపారు. 
 

58 స్టూడెంట్లపై సస్పెన్షన్​వేటు
శివమొగ్గ జిల్లాలోని షీరాలకొప్పలో గవర్నమెంట్​కాలేజీకి హిజాబ్‌‌తో వచ్చిన స్టూడెంట్లు​ తమను క్లాస్​రూమ్​కు అనుమతించాలని డిమాండ్​ చేశారు. హిజాబ్​ లేకుండా రావాలని ప్రిన్సిపాల్​కోరగా.. కాలేజీ మేనేజ్​మెంట్​కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో ప్రిన్సిపాల్​58 మంది స్టూడెంట్లను సస్పెండ్ ​చేశారు. ‘‘ప్రిన్సిపాల్ మమ్మల్ని సస్పెండ్ చేశారు. పోలీసులు కూడా మమ్మల్ని కాలేజీకి రావొద్దంటున్నారు” అని ఓ స్టూడెంట్​ఆవేదన వ్యక్తం చేశాడు. హిజాబ్ సమస్య కారణంగా బెళగావి జిల్లాలోని విజయ్ పారామెడికల్ కాలేజీ టెంపరరీ సెలవులు ప్రకటించిందని విద్యార్థులు తెలిపారు. మరోవైపు, దక్షిణ కన్నడ జిల్లాలో  ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలకు 200 మీటర్ల దూరం వరకు ఉన్న144 సెక్షన్​ను ఫిబ్రవరి 26 వరకు 
ప్రభుత్వం పొడిగించింది.

For More News..

ప్రభాస్తో నటించడం నాకు దక్కిన గౌరవం

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది: జగ్గారెడ్డి