రైతు కన్నీరు : కిలో ఉల్లి రూపాయి.. మరో చోట 2 రూపాయలు

రైతు కన్నీరు : కిలో ఉల్లి రూపాయి.. మరో చోట 2 రూపాయలు

ఉల్లి ధర రైతన్నకు కన్నీరు మిగుల్తుంది. కిలో ఉల్లి ధర కనిష్ట ధర ధరకు పడిపోవడంతో రైతన్న ఏం చేయాలో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాడు. ఉల్లిగడ్డను అమ్మితే గిట్టుబాటు ధర ఏమో కానీ అది తీసుకవచ్చిన ట్రాన్స్ పోర్టు ఖర్చులన్న వస్తాయా రావా అనే సందిగ్ధంలో పడిపోయాడు. కిలో ఉల్లిగడ్డ రూపాయికి పడిపోవడంతో రైతన్న దయనీయ స్థితిలో పడ్డాడు. ద్రవ్యోల్బణం కారణంగా రైతలు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతకు ఎక్కడంటే..  

 మహారాష్ట్ర మార్కెట్లకు ఉల్లి రాక తగ్గినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. సోలాపూర్, రాహురి వంటి ప్రాంతాల్లో ఫిబ్రవరి 10న కిలో ఉల్లి ధర రూ. 1కి వచ్చి చేరింది. మన్మాడ్‌లో కిలో ధర రూ.2గా ఉంది. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర రైతులు ఉల్లి సాగును వదిలి ఇతర పంటల సాగుకు ఎంచుకుంటున్నారు. ఎగుమతి నిషేధం కారణంగా చాలా మంది రైతులు కిలోకు రూ.1 నుంచి రూ.8 వరకు ధర పలుకుతున్నారని మహారాష్ట్ర కంద ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షుడు భరత్ డిఘోలే చెప్పారు.

ALSO READ | వ్యవసాయం చేసే వారికే రైతు భరోసా : సీఎం రేవంత్ రెడ్డి

ఇంత జరిగినా ప్రభుత్వం ఎగుమతుల నిషేధ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.  ఫిబ్రవరి 10న సోలాపూర్ మార్కెట్‌కు 30వేల క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. కనీస ధర క్వింటాల్‌కు రూ.100గా ఉంది. లక్ష క్వింటాళ్లకు పైగా వచ్చిన ధర అదే స్థాయిలో ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.