
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఒప్పో.. రెనో 10 5జీ ఫోన్‌ను హైదరాబాద్‌లో సోమవారం లాంచ్ చేసింది. స్లీక్ డిజైన్, సూపర్‌వూక్ చార్జింగ్, డైనమిక్ కంప్యూటింగ్ ఇంజన్, బ్యాటరీ హెల్త్ ఇంజన్ వంటివి దీని ప్రత్యేకతలు. ఇందులో 6.7 ఇంచుల అమోలెడ్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, రిమోట్ కంట్రోల్ సెన్సర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా యూనిట్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, అండ్రాయిడ్ 13 ఓఎస్ ఉంటాయి. ధర రూ.33 వేలు. కొన్ని బ్యాంకుల కార్డులతో కొంటే రూ.మూడు వేలు డిస్కౌంట్ ఉంటుంది.