
భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ ను బౌలర్ అర్షదీప్ సింగ్ ఔట్ చేశాడు. రెండో ఓవర్ తొలి బంతికే అర్షదీప్ సింగ్..ఆజమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో పాక్ కెప్టెన్ ఆజమ్..పరుగులలేమి చేయకుండానే పెవీలియన్ చేరాడు. అంతకుముందు ఫస్ట్ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్..ఒకే పరుగు ఇచ్చాడు.
భారత్ పాక్ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
టీమిండియా తుదిజట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్, సూర్యకుమార్, దినేష్ కార్తీక్, హార్దిక్, అశ్విన్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ ,షమీ
పాకిస్తాన్ తుది జట్టు: బాబర్ అజామ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, ఆసిఫ్ అలీ, షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా, హారిస్ రవుఫ్