మాక్స్లైఫ్ అధికారిగా నటిస్తూ రూ.15.74 లక్షల మోసం

మాక్స్లైఫ్ అధికారిగా నటిస్తూ   రూ.15.74 లక్షల మోసం
  • ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో పాన్ మసాలా వ్యాపారి అరెస్ట్ 

బషీర్​బాగ్, వెలుగు: ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసులో ఘజియాబాద్​కు చెందిన శరద్ గార్గ్‌ (35)ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు దేశవ్యాప్తంగా ఆరు కేసుల్లో ప్రమేయం కలిగి ఉండగా, వాటిలో ఒకటి తెలంగాణకు సంబంధించినదని సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. సిటీకు చెందిన 37 ఏండ్ల వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ అధికారిగా నటిస్తూ ప్రశాంత్ త్రిపాఠి అనే వ్యక్తి బాధితుడిని ఫోన్ ద్వారా సంప్రదించాడు.

 పాలసీ పునరుద్ధరణ పేరుతో రూ.6,45,225 వసూలు చేశాడు. వివిధ కారణాలతో అదనపు మొత్తాలు కూడా కోరాడు. మొత్తంగా బాధితుడు రూ.15,74,775 బదిలీ చేయగా, చివరికి మోసపోయినట్లు తేలింది. ప్రధాన నిందితుడు శరద్ గార్గ్​ఘజియాబాద్‌కు లో పాన్ మసాలా వ్యాపారి అయిన అతను అధిక లాభాల కోసం ఈ నేరాలకు పాల్పడ్డాడు. నిందితుడి నుంచి మూడు ఫోన్లు, నాలుగు చెక్కు బుక్​లు, రెండుబ్యాంక్ కార్డులు, ఒక ల్యాప్‌టాప్ , రెండు షెల్ కంపెనీల స్టాంపులు సీజ్ చేశారు.