
నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ అవినిగడ్డలో ప్రారంభించారు. 2024 లో వచ్చేది టీడీపీ.. జనసేన సంకీర్ణ ప్రభుత్వమేనని పవన్ తెలిపారు. అవినగడ్డలో సభలో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే నన్నారు. కురుక్షే త్ర యుద్దంలో తాము పాండవులమని.. వైసీపీ నేతలు కౌరవులమంటూ... మీరు ఓడిపోవడం ఖాయం.. మేము గెలవడం ఖాయమన్నారు. తనను కదనరంగంనుంచి పారిపొమ్మంటున్నారంటూ కొంతమంది బెదిరిస్తున్నారని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజీ విషయంలో గతంలో తాను టీడీపీతో విభేదించానన్నారు.
మెగా డీఎస్సీ కోరుకుంటున్నవారికి అండగా ఉంటానంటూ.. 2018 నుంచి టీచర్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ... జగన్ పాదయాత్రలో ఇవ్వని హామీ లేదన్నారు. వైసీపీని అధికారంలోనుంచి దించడమే జనసేన లక్ష్యమన్నారు.
వైసీపీ పతనం మొదలైందన్న పవన్... జగన్ అద్భుతమైన పాలకుడైతే తాను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రధాని మోడీకి కూడా జగన్ గురించి తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించాలని కోరారు.