Movie Launch: సత్య, యోగిబాబు హీరోలుగా క్రేజీ ఎంటర్‌టైనర్.. సెన్సేషనల్ కాంబోని సెట్ చేసుకున్న డైరెక్టర్

Movie Launch: సత్య, యోగిబాబు హీరోలుగా క్రేజీ ఎంటర్‌టైనర్.. సెన్సేషనల్ కాంబోని సెట్ చేసుకున్న డైరెక్టర్

‘రంగబలి’ మూవీ డైరెక్టర్ పవన్ బసంశెట్టి కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఫస్ట్ సినిమాతోనే నాగశౌర్య లాంటి యంగ్ హీరోతో దర్శకుడిగా పరిచయమైన పవన్ బసంశెట్టి.. ఈ సారి క్రేజీ కాంబోతో వస్తున్నాడు. లేటెస్ట్ సెన్షేషనల్ కామెడీ స్టార్స్ సత్య, యోగిబాబు హీరోలుగా మూవీ చేస్తున్నారు. ఇవాళ మే11, 2026న మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ ప్రాజెక్ట్ను పవన్ ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. ‘రంగబలి’ చిత్రంలో కామెడీ సీన్లను అద్భుతంగా పండించిన డైరెక్టర్ పవన్, ఈసారి సత్య-యోగిబాబు కాంబినేషన్‌తో కొత్త కామెడీ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్స్ కిషోర్ తిరుమల, సందీప్ రాజ్, మహేష్ బాబు, యదు వంశీ తదితరులు హాజరై చిత్రబృందానికి బెస్ట్ విషెష్ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా లాంచ్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ పవన్ బసంశెట్టి స్వయంగా నాగర్జున రెడ్డితో కలిసి కో-ప్రొడ్యూసర్గా నిర్మిస్తున్నారు. 'రంగబలి'కి సంగీతం అందించిన పవన్ సిహెచ్ ఈ కొత్త చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ & హీరోయిన్స్ మరియు నటినటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.  

ఇకపోతే, సత్య, యోగిబాబు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వీరి నుంచి సినిమా వస్తుందంటే.. హిట్ అయినట్టే అనే ట్యాగ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటీవలే సత్య జెట్లీ మూవీతో హీరోగా మారారు. అంతకుముందు మత్తు వదలరా ఫ్రాంచైజీలో కీలక పాత్ర పోషించి హీరో తనే అనుకునేలా నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే సత్యతో డైరెక్టర్లు కొత్త సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.