బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో సీట్ల అలాట్మెంట్

బీపీఈడీ, డీపీఈడీ  కోర్సుల్లో సీట్ల అలాట్మెంట్

హైదరాబాద్, వెలుగు: బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం1,659 సీట్లున్నాయి. వీటిలో 1,080 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 956 మందికి సీట్లు అలాట్ అయ్యాయని అడ్మిషన్ల కన్వీనర్ పాండు రంగారెడ్డి తెలిపారు. బీపీఈడీలో1,385 సీట్లకు 718, డీపీఈడీలో 274 సీట్లకు 238 సీట్లు నిండినట్టు పేర్కొన్నారు. సీట్లు పొందినవారు ఈ నెల 8లోగా  రిపోర్టు చేయాలని సూచించారు.