సెప్టెంబర్ 21న వేయి స్తంభాల గుడి వద్ద ఉత్సవాలు ప్రారంభం

సెప్టెంబర్ 21న వేయి స్తంభాల గుడి వద్ద ఉత్సవాలు ప్రారంభం

హనుమకొండ, వెలుగు: ఈ నెల 21న వరంగల్ వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయని, ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆఫీసర్లను ఆదేశించారు.  హనుమకొండ కలెక్టరేట్ లో సోమవారం వివిధ శాఖల అధికారులు, వేద పండితులతో బతుకమ్మ ఉత్సవ ఏర్పాట్లపై కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, పద్మాక్షి, వెయ్యి స్తంభాల ఆలయాల ప్రధానార్చకులు శంకర శాస్త్రి, గంగు ఉపేంద్ర శర్మ, హనుమకొండ ఏసీపీ నరసింహరావు, ఇతర ఆఫీసర్లు ఏర్పాట్ల గురించి వివరించారు. 

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాల ఏర్పాట్లలో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విద్యుత్తు లైట్లు, తాగునీరు, శానిటేషన్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్న ఆలయాల వద్ద ప్రశాంతంగా సాగే విధంగా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వో వైవీ.గణేశ్, డీఎంహెచ్వో అప్పయ్య, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ మధుసూదన్, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ బాబు, డీఆర్డీవో మేన శ్రీను తదితరులు పాల్గొన్నారు.