స్క్రీన్ పిన్ తో ఫోన్ ప్రైవసీ

స్క్రీన్ పిన్ తో ఫోన్ ప్రైవసీ

స్మార్ట్‌‌ఫోన్‌‌ యూజర్స్‌‌లో ఎక్కువమంది వాడేది ఆండ్రాయిడ్‌‌ ఓఎస్‌‌ ఫోన్స్‌‌. ఈ ఓఎస్‌‌లో చాలా ఫీచర్స్‌‌ ఉంటాయి. కానీ, వీటిలో చాలా వాటి గురించి యూజర్స్‌‌కు పెద్దగా తెలియదు. ఈ ఫీచర్స్‌‌ గురించి తెలుసుకుంటే స్మార్ట్‌‌ఫోన్‌‌ వాడటం మరింత ఈజీ అవుతుంది. అలాంటి కొన్ని ఫీచర్స్‌‌ ఇవి. 

కొన్నిసార్లు ఫ్రెండ్స్‌‌ లేదా కొలీగ్స్‌‌ ఏదైనా యాప్‌‌ వాడుకోవడానికి ఫోన్‌‌ అడుగుతుంటారు. అలాంటప్పుడు ఆ యాప్‌‌ తప్ప మరో యాప్‌‌ వాడకుండా చేయొచ్చు. దీని కోసం ‘స్క్రీన్‌‌ పిన్నింగ్‌‌’ అనే ఫీచర్‌‌‌‌ ఎనేబుల్‌‌ చేసుకోవాలి. సెట్టింగ్స్‌‌లో సెక్యూరిటీ లేదా డివైజ్‌‌ అండ్‌‌ ప్రైవసీలో కనిపించే ‘స్క్రీన్‌‌ పిన్నింగ్‌‌’ ఆప్షన్‌‌ సెలక్ట్‌‌ చేయాలి. తర్వాత రీసెంట్‌‌ బటన్‌‌పై ప్రెస్‌‌ చేసి, కావాల్సిన యాప్‌‌ పైన కనిపించే త్రీ డాట్‌‌ బటన్‌‌లో ‘ఫిక్స్‌‌డ్‌‌’ పేరుతో ఒక ‘పిన్‌‌’ ఐకాన్‌‌ కనిపిస్తుంది. దానిపై ట్యాప్‌‌ చేస్తే, స్క్రీన్‌‌పై ఆ యాప్‌‌ మాత్రమే ఓపెన్‌‌ అవుతుంది. వేరే యాప్‌‌ కనిపించదు. తర్వాత పాస్‌‌వర్డ్‌‌ ఎంటర్‌‌‌‌ చేస్తేనే, ఆ యాప్‌‌ పోయి మెనూ కనిపిస్తుంది.  ఆండ్రాయిడ్‌‌ 9 ‘పై’, ఆ తర్వాతి వెర్షన్స్‌‌ ఫోన్స్‌‌లో స్ప్లిట్‌‌ స్క్రీన్‌‌ ఆప్షన్‌‌ ఉంది. ఒకేసారి రెండు యాప్స్‌‌ వాడాలంటే ఈ ఫీచర్‌‌‌‌ యూజ్‌‌ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్‌‌. ఫోన్‌‌లో ఉండే రీసెంట్‌‌ యాప్‌‌ బటన్‌‌పై ప్రెస్‌‌ చేస్తే చాలా యాప్స్ కనిపిస్తాయి. స్ప్లిట్‌‌ స్క్రీన్‌‌లో వాడాలనుకుంటున్న యాప్‌‌ సెలక్ట్‌‌ చేసుకుంటే, పైన త్రీ డాట్‌‌ మెనూ కనిపిస్తుంది. ఆ మెనూపై ట్యాప్‌‌ చేస్తే స్ప్లిట్‌‌ స్క్రీన్‌‌ ఆప్షన్‌‌ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్‌‌ చేసుకుంటే స్క్రీన్‌‌పై సగం వరకే యాప్‌‌ పనిచేస్తుంది. మిగతా సగం స్క్రీన్‌‌ కోసం కింద యాప్స్‌‌ మెనూ కనిపిస్తుంది. దానిలోంచి కావాల్సిన యాప్‌‌ను ఓపెన్‌‌ చేసుకోవాలి. రెండు యాప్స్‌‌ సగం పైన ఒకటి, కింద మరోటి రన్‌‌ అవుతాయి.

ఫోన్‌‌ స్క్రీన్‌‌ లాక్‌‌ సెట్‌‌ చేసుకుంటే, ఫోన్‌‌ వాడాల్సిన ప్రతిసారీ పాస్‌‌వర్డ్‌‌ ఎంటర్‌‌‌‌ చేయడమో, ఫింగర్‌‌‌‌ప్రింట్‌‌ లేదా ఫేస్‌‌ ఐడీ వాడాలి. అయితే, ఇంట్లో ఉన్నప్పుడు లేదా కొందరిమధ్య ఉన్నప్పుడు ఇలా ఫోన్‌‌ లాక్‌‌ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ప్రతిసారీ ఫోన్‌‌ సెక్యూరిటీ తీసేయడం, అవసరమైనప్పుడు తిరిగి సెట్‌‌ చేసుకోవడం కష్టమైన పని. ఈ ఇబ్బందేమీ లేకుండా ఉండాలంటే ‘స్మార్ట్‌‌లాక్‌‌’ వాడాలి. 
ఈ ఫీచర్‌‌‌‌ ద్వారా ‘ట్రస్టెడ్‌‌ ప్లేస్‌‌’లో ఉన్నప్పుడు ఫోన్‌‌ అన్‌‌లాక్‌‌లో ఉంటుంది. అంటే ఇంటిని ట్రస్టెడ్‌‌ ప్లేస్‌‌గా సెలక్ట్‌‌ చేసుకుంటే, ఇంట్లో మాత్రం ఫోన్‌‌ అన్‌‌లాక్‌‌లో ఉంటుంది. బయటికి వెళ్లగానే లాక్‌‌ ఫీచర్‌‌‌‌ పనిచేస్తుంది. అప్పుడు ఫోన్‌‌ వాడాలంటే సెక్యూరిటీ పాస్‌‌వర్డ్‌‌ ఎంటర్‌‌‌‌ చేయాలి. అలాగే ‘బాడీ డిటెక్షన్‌‌’, ‘ట్రస్టెడ్‌‌ డివైజెస్‌‌’ వంటి ఆప్షన్స్‌‌ కూడా ఉన్నాయి. అంటే మీ చేతిలో ఉన్నంతసేపు,  అలాగే కొన్ని బ్లూటూత్‌‌ డివైజెస్‌‌ దగ్గర ఉన్నప్పుడు ఫోన్‌‌ అన్‌‌లాక్‌‌లోనే ఉంటుంది.