
పేదల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు ప్రధాని మోడీ. గత ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. సంపాదించుకోవడం, వాటిని దాచుకోవడానికే వారికి సరిపోయిందన్నారు. కానీ తాము అలా కాదన్నారు మోడీ. పేదలను ఏ విధంగా బాగు చేయాలని నిరంతరం ఆలోచిస్తామన్నారు. యూపీలోని సిద్ధార్థ్ నగర్లో 9 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు మోడీ. గతంలో ఎవరైనా 9 కాలేజీలు ఓపెన్ చేశారా అని ప్రశ్నించారు. కొత్త మెడికల్ కాలేజీలతో అదనంగా 2వేల 500 బెడ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 5వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు మోడీ.
ఉత్తరప్రదేశ్ లో ఇకపై పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను డాక్టర్లను చేయాలనే కల నెరవేర్చుకోవచ్చన్నారు.యూపీలో చాలా వేగంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేశామన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయనని చెప్పారు. 70 ఏళ్లలో లేనంతగా రాబోయే 12 ఏళ్లలో ఉత్తరప్రదేశ్ లో డాక్టర్లు తయావుతారన్నారు.