ఇవి మహిళలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..

ఇవి మహిళలకు హానికరం.. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ కీలక వ్యాఖ్యలు..

కంప్యూటర్ యుగంలో  చూపులు కలిస్తే చాలు..  పెళ్లి అయ్యేంత వరకు ఆగడంలేదు. కాబోయే దంపతులు ప్రి వెడ్డింగ్ షూట్లకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో పెళ్లికంటే కూడా ప్రి వెడ్డింగ్ షూట్లకు పెట్టే ఖర్చు అంతా ఇంతాకాదు.  వీకెండ్ వస్తే చాలు.. వారి ఎంజాయిమెంట్ కు హద్దులు లేకుండా పోతున్నాయి. అయితే ఒక్కొక్కసారి ఇవి కాంట్రవర్సీలకు, ప్రమాదాలకు కూడా కారణం అవుతున్నాయని ఛత్తీస్‌గఢ్ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ కిరణ్మయి నాయక్ అన్నారు. ప్రస్తుతం ఆమె  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

ఛత్తీస్ గడ్ రాయ్ పూర్ లో మే 9న  కిరణ్మయి నాయక్ అధ్యక్షతన 172వ పబ్లిక్ హియరింగ్ జరిగింది. ఇందులో భార్యభర్తల మధ్య వివాదాల కేసులే ఎక్కువగా లిస్టింగ్కు వచ్చాయి.  ఇందులో ఓ కేసును పరిశీలించిన కిరణ్మయి నాయక్ ఈరోజుల్లో ప్రజలు పాశ్చాత్య సంస్కృతి ద్వారా ఎక్కువగా ప్రభావితం అవుతున్నారని ... ఇది మన భారత సంస్కృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లను నివారించాలని కోరారు.  ఇది ఒకవేళ పెళ్లిళ్లు విఫలం అయినప్పుడు, విడాకుల వరకు వెళ్తే అమ్మాయిలకు హానికరంగా మారే అవకాశం ఉందని అన్నారు.

కేసు వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి డేట్ ఫిక్స్ అయిన పెళ్లి జరగలేదని ఒకరు కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయితే హియరింగ్ సమయంలో ఈ కేసును విత్ డ్రా చేసుకున్నారు. ఇరు పక్షాలు పెళ్లి ఏర్పాట్లకు, ఫోటోలకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు పెట్టిన ఖర్చులను చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాయని, ఫ్రీ వెడ్డింగ్ వీడియోలను, ఫోటోలను డిలీట్ చేసేలా ఒప్పందం కుదరిందని కమిషన్ ముందు తెలిపారు. భవిష్యత్తులో ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కాకుండా ఈ చర్యలు తీసుకున్నారని దరఖాస్తుదారు చెప్పారు.