వ్యాపారులు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్: మళ్లీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, వరుసగా నాలుగోసారి..

వ్యాపారులు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్:  మళ్లీ తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు, వరుసగా నాలుగోసారి..

గ్యాస్ కంపెనీలు నేడు 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరను రూ.33.50 తగ్గించాయి. దింతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్‌ ధర రూ. 1,631.50కి చేరింది.  గత నెల జూలైలో రూ. 58.50, జూన్‌లో రూ. 24, ఏప్రిల్‌లో రూ. 41, ఫిబ్రవరిలో రూ. 7 తగ్గగా, మార్చిలో మాత్రం రూ. 6 పెరిగింది.  కొత్త ధరల ప్రకారం కోల్‌కతా ఇప్పుడు 19 కిలోల సిలిండర్ ధర రూ. 1,735.50, ముంబై రూ. 1,583, చెన్నై రూ. 1,790. 

మరోవైపు వంటింటి గ్యాస్14.2 కిలోల సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం దీని ధర ఢిల్లీలో రూ. 853 వద్ద స్థిరంగా ఉంది. కానీ హోటళ్ళు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకి కమర్షియల్ సిలిండర్ల ధరల తగ్గింపు కొంత రిలీఫ్ అందిస్తుంది. 

భారతదేశంలోని దాదాపు 90 శాతం LPG వంటింటి గృహాలకు వాడుతుండగా, 10 శాతం వాణిజ్య, పారిశ్రామిక & ఆటోమోటివ్ రంగాలలో ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో హెచ్చుతగ్గులకి  అనుగుణంగా వాణిజ్య సిలిండర్ ధరలు ప్రతినెల మారుతూ ఉంటాయి. అలాగే స్థానిక పన్నుల కారణంగా ధరలు ప్రతి నగరం నుండి నగరానికి మారుతుంటాయి. 

తెలంగాణ, హైదరాబాద్లో   14.2కిలోల సిలిండర్ ధర రూ.905.00 అలాగే కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1,852.00 అంటే ఇవాళ  రూ.34.50 తగ్గింది.